సహకరించకపోతే జరిమానా వేస్తామన్నారు!

13 Sep, 2014 04:34 IST|Sakshi

వాషింగ్టన్: అమెరికా రహస్య నిఘా కార్యక్రమం ‘ప్రిజమ్’ కోసం యూజర్ల డేటా ఇచ్చి సహకరించకపోతే రోజుకు రూ. 1.5 కోట్ల(2.5 లక్షల డాలర్లు) జరిమానా వేస్తామని అమెరికా ప్రభుత్వం తమను హెచ్చరించినట్లు ఇంటర్నెట్ దిగ్గజం యాహూ తెలిపింది. కోర్టు డాక్యుమెంట్లలో ఈ విషయం ఉందని కంపెనీ న్యాయవాది రాన్ బెల్ ఓ బ్లాగులో తెలిపారు. నిఘా యత్నాలను అడ్డుకోవడానికి తమ యత్నాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. యూజర్ల సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం 2007లో ఓ కీలక చట్టాన్ని సవరించిందని, అది రాజ్యాంగ విరుద్ధం కనుక సహకరించేందుకు నిరాకరించామన్నారు.

>
మరిన్ని వార్తలు