యెమెన్ లో ఆకలి చావులు

3 Jan, 2017 03:43 IST|Sakshi
యెమెన్ లో ఆకలి చావులు

సరైన ఆహారం లేక ఎముకలు తేలిన శరీరంతో ఆసుపత్రి బెడ్‌పై దీనంగా కూర్చుని ఉన్న ఈ ఐదేళ్ల బాలుడి పేరు మొహన్నద్‌ అలీ. ఇతని రెండేళ్ల వయసున్న సోదరుడు ఈ మధ్యే ఆకలితో మృతిచెందాడు. ఇప్పుడు అలీ కూడా చావుకు దగ్గరగా ఉన్నాడనీ, కాపాడుకోడానికి తీవ్రంగా శ్రమిస్తున్నానని అతని 19 ఏళ్ల అన్న చెబుతున్నాడు. ఈ ఫొటోను 2016 డిసెంబరు 12న తీయగా యూనిసెఫ్‌ విడుదల చేసింది.  ప్రచ్ఛన్న యుద్ధం వల్ల యెమెన్‌ ప్రజలు ఆహారం కోసం పడుతున్న కష్టాలకు ఈ ఫొటో సాక్ష్యంగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు