తొలి కాలుష్యరహిత నగరం ‘యోర్క్‌’

13 May, 2020 14:26 IST|Sakshi
యోర్క్‌ నగరంలో సైకిళ్లపై వెళుతున్న పౌరులు

లండన్‌ : కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం గణనీయంగా తగ్గిన విషయం తెల్సిందే. బ్రిటన్‌లో పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు పొందిన యోర్క్‌ నగరం ఈ అంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని నగరంలో కేవలం సైకిళ్లు, ఎలక్ట్రిక్‌ కార్లను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. కరోనా కట్టడి భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన నాటి నుంచి ప్రజా రవాణాలకు ఈ రెండింటిని మాత్రమే అనుమతించాలని నగర కౌన్సిల్‌ నిర్ణయించింది. నగరంలో సైకిళ్లను ప్రోత్సహించేందుకు రవాణా మంత్రి గ్రాండ్‌ షాప్స్‌ ఏకంగా రెండు బిలియన్‌ పౌండ్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. చారిత్రక కట్టడాలు కలిగిన యోర్క్‌ నగరంలో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా 2023 సంవత్సరం నుంచి ప్రైవేటు కార్లను నిషేధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేశాక సైకిళ్లు,  ఎలక్ట్రిక్‌ కార్లను మినహా మరే ఇతర వాహనాలను అనుమతించరాదని నిర్ణయించింది. ( క‌రోనాతో లింక్ ఉన్న మ‌రో వ్యాధి బ‌ట్ట‌బ‌య‌లు )

బ్రిటన్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక నగరం ఇదే! బ్రిటన్‌ మొత్తం మీద కాలుష్య రహిత నగరంగా ఇదే చరిత్రకెక్కనుందని కౌన్సిలర్లు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో అత్యవసరంగా ప్రజలు నగరంలో సైకిళ్లపై తిరగడం చూస్తే ఎంతో ముచ్చటేస్తోందని లిబరల్‌ డెమోక్రట్‌ కౌన్సిలర్‌ పావులా విడ్డోసన్‌ వ్యాఖ్యానించారు. ఈ నగరాన్ని ఏడాది 70 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారు. 
( క‌రోనా: బుర్జ్ ఖ‌లీఫా‌..12 లక్షల భోజనాలు! )

మరిన్ని వార్తలు