నలుగురిలో ఒకరికి స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం!

3 Dec, 2019 08:21 IST|Sakshi

లండన్‌: ప్రపంచంలో ప్రతి నలుగురు యువతీయువకుల్లో ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌ వ్యసనానికి అలవాటు పడ్డారని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో లేకపోతే వీరు ఆందోళనకు గురవుతున్నారని, నిరుత్సాహానికి గురవుతున్నారని వీరు అంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు విస్తృత వ్యాప్తిలోకి వచ్చిన 2011 సంవత్సరం నుంచి జరిగిన వేర్వేరు అధ్యయనాలు పిల్లలు, యువతీయువకుల్లో 10 – 30 శాతం మంది వీటిని తగువిధంగా వాడటం లేదని ఇప్పటికే ఒక విశ్లేషణ ఉంది. ఇదే లెక్కన చూస్తే వీరిలో సగటున 23 శాతం మంది సమస్యాత్మక స్మార్ట్‌ఫోన్‌ వినియోగం చేస్తున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్మార్ట్‌ఫోన్‌ వ్యసనానికి బానిసలు కావడం వల్ల మానసిక సమస్యల బారిన పడుతున్నారని తేల్చారు.

మరిన్ని వార్తలు