యూట్యూబ్‌లో అలాంటి వీడియోలపై నిషేధం

23 Mar, 2018 17:05 IST|Sakshi

న్యూయార్క్‌ : ప్రముఖ వీడియో వెబ్‌సైట్‌ ‘యూట్యూబ్‌’  సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాల తయారీ, అమ్మకాలకు సంబంధించిన  వీడియోలను తమ సైట్‌లో  నిషేధించాలని నిర్ణయించింది. ఆయుధాల వాడకంతో సమాజంలో చోటుచేసుకుంటున్న తీవ్ర పరిణామాలతో ఆంక్షలను యూట్యూబ్‌ కఠినతరం చేసింది. గత నెల అమెరికాలోని పార్క్‌లాండ్‌ స్కూల్‌లో చోటుచేసుకున్న సామూహిక కాల్పుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్ధ తెలిపింది. 

నాలుగు నెలలుగా ఈ విషయంపై సంస్థ నిపుణులతో చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఆయుధాలను ఎలా ఉపయోగించాలో తెలిపే వీడియోలను య్యూట్యూబ్‌ ఇదివరకే నిషేధించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలను చూసి స్ఫూర్తి  పొందిన ఓ వ్యక్తి లాస్‌వెగాస్‌లో 58 మందిని కాల్చి చంపాడు. ఈ ఘటన అనంతరం  యూట్యూబ్‌ ఆయుధాలకు సంబంధించిన వీడియోలపై నిషేదం విధించింది. వచ్చే నెల  నాటికి పూర్తి స్థాయిలో ఈ నిషేధాన్ని అమలులోకి తెస్తామని సంస్థ తెలిపింది. 

మరిన్ని వార్తలు