అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌తో సీఎం జగన్‌ భేటీ

17 Aug, 2019 16:10 IST|Sakshi

వాషింగ్టన్‌ డీసీ :  అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యూఎస్‌ విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.  హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ కొత్త జనరల్‌ జోయల్‌ రిచర్డ్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అనంతరం మధ్య, దక్షిణాసియా వ్యవహారాల ఉప మంత్రి థామస్‌ వాజ్దాతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్‌ క్లాడియా లిలైన్‌ఫీల్డ్‌తో సీఎం చర్చలు జరిపారు.

గ్లోబల్‌ సస్టైనబిలిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ క్లేనెస్లర్‌తోనూ భేటీ అయి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సోలార్‌ పవర్‌ & ఉపకరణాల తయారీలో ప్రముఖ సంస్థ అయిన జాన్స్‌ కంట్రోల్స్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్‌ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ సిటీ నిర్మాణంలో సహకారం అందిస్తామని జాన్సన్‌ కంట్రోల్స్‌ ప్రతినిధులు చెప్పారు. పట్టణాభివృద్ధి, జల నిర్వహణలో సహకారం అందించేందుకు సిద్ధమని జీలీడ్‌ సైస్సెస్‌ వెల్లడించింది. వ్యవసాయ పరిశోధనలో ఏపీకి సహకరిస్తామని జీలీడ్‌ సైన్సెస్‌ సభ్యులు పేర్కొన్నారు.
(చదవండి : సీఎం జగన్‌తో ‘ఆస్క్‌ ఏ క్వశ్చన్‌ టు సీఎం’)

(చదవండి : అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం మాది)

మరిన్ని వార్తలు