వైఎస్ జగన్ రాకతో న్యూజెర్సీలో పండుగ

26 Sep, 2013 22:15 IST|Sakshi
వైఎస్ జగన్ రాకతో న్యూజెర్సీలో పండుగ

న్యూజెర్సీ: వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలునుంచి బయటకు రావడంతో అమెరికాలో పండుగ వాతావరణం నెలకొంది. ఆళ్ళ రామిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ రాఘవ రెడ్డి, సురేష్ రెడ్డి, హరి వేల్కుర్, శ్రీకాంత్ గుడిపాటి, అన్నారెడ్డి, రమణ దేవులపల్లి, శ్రీకాంత్ పెనుమాడ, ప్రతాప్ భీమిరెడ్డి, సంతోష్ పాతూరి ఆధ్వర్యంలో జరిగిన  సమావేశానికి ఈశాన్య అమెరికాలో ఉంటున్న 300 పైగా వైఎస్సార్ అభిమానులు హాజరైనారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైనా పలువురు వక్తలు ప్రసంగించారు.

ఓదార్పు యాత్రకు వెళతానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఆస్తులు పోయినా, జైలుకు వెళ్లినా పర్వాలేదు అని ధైర్యంగా మాట మీద నిలబడిన ధీరుడు వైఎస్ జగన్.  మన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరధం పట్టడం చూస్తుంటే ఎంత గొప్ప నాయకుడైనాడో తెలిసిపోతున్నది. ఇంతటితో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి కష్టాలు తీరిపోవాలని కోరుకుంటూ జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు విశ్రమించకుండా అన్ని విధాలా వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉంటామని కార్యకర్తలు అందరూ ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు.  మంగళవారం పనిరోజు అయినప్పటికీ ఇంతమంది అభిమానులు తమ సంతోషాన్ని పంచుకోవడానికి కలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం తీసుకు రాగలిగిన ఏకైక నాయకుడు జగనే అని, అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పీడ విరగడ కావాలని ఆకాంక్షించారు. రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డులో ఇలాంటి సమయంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి నీరాజనం పట్టడం చూస్తేంటే జనంలో ఎంత అభిమానం ఉన్నదో అర్ధం అవుతున్నదని తెలియ చేశారు. రామిరెడ్డి మాట్లాడుతూ జగన్ లాంటి నాయకుణ్ణి భారత దేశం మొత్తం మీద వెతికినా కూడా ఒక్క నాయకుడు కూడా దొరకడని, కేసులకు భయపడి ఎంతో మంది నాయకులు తలవంచారని ఒక్క జగనే ధైర్యంగా నిలబడి పోరాడాడని చెప్పారు. ఈ సభలో సురేష్ రెడ్డి, రమణ దేవులపల్లి, శ్రీకాంత్ పెనుమాడ, ప్రతాప్ భీమిరెడ్డితో పాటు పలువురు వక్తలు ప్రసంగించారు. కాగా, ఈ సమావేశం ఆళ్ళ రామిరెడ్డి వందన సమర్పణతో ముగిసింది.

మరిన్ని వార్తలు