యూఎఫ్‌వోనా? సూర్యుడి ఎఫెక్టా!?

3 Jun, 2015 00:56 IST|Sakshi
యూఎఫ్‌వోనా? సూర్యుడి ఎఫెక్టా!?

గ్రహాంతరవాసుల వ్యోమనౌక  నేలకు దిగుతున్నట్లున్న ఈ దృశ్యం హాలెండ్‌లోని గ్రోనింజెన్‌లో కనిపించింది. హ్యారీ పెర్టన్ అనే బ్లాగర్ తన ఇంటి నుంచి ఇటీవల తుపాను వాతావరణాన్ని ఫొటోలు తీస్తుండగా ఆకాశంలో మెరుపు మెరిసింది. ఫొటోలు వచ్చాక చూస్తే ఇలా.. ఓ యూఎఫ్‌వో(గుర్తు తెలియని ఎగిరే పళ్లెం) నేలకు దిగుతున్నట్లుగా కనిపించింది.

ఇది యూఎఫ్‌వోనే కావొచ్చని కొందరు.. వాతావరణం మారిపోవడంతో ఇలా కనిపించి ఉంటుందని మరికొందరు అంటున్నారు. తుపాను మేఘాల్లోకి సూర్యకిరణాలు చొచ్చుకొచ్చి ఇలా రంగుల కాంతి విరజిమ్మి ఉంటుందని శాస్త్రవ్తేలు చెబుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు