యప్ టీవీకి ఏషియా కప్ డిజిటల్ రైట్స్

13 Feb, 2016 14:06 IST|Sakshi
యప్ టీవీకి ఏషియా కప్ డిజిటల్ రైట్స్

ఈనెల 24 నుంచి మార్చి 6 వరకు జరగనున్న ఏషియా కప్ టి 20 మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ మీడియా రైట్స్ తమకు సొంతం అయినట్లు యప్ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. యప్‌టీవీ యాప్‌తో పాటు ఇంటర్‌నెట్ ఎనేబుల్డ్ పరికరాలలో కూడా ఈ టి20 మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందిస్తామని చెప్పింఇ. అమెరికా, కెనడా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియా దేశాలతో పాటు.. సింగపూర్‌లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఏషియా కప్ 2016ను యప్‌టీవీ ద్వారా చూడొచ్చు. స్మార్ట్ టీవీలు, స్మార్ట్ బ్లూరే ప్లేయర్లు, స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్లు, ల్యాప్‌టాప్, గేమింగ్ కన్సోల్, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో ఈ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉందని తెలిపారు.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏషియా కప్ టి20 టోర్నమెంటు నిర్వహిస్తారు. ప్రారంభ మ్యాచ్ భారత్- బంగ్లా జట్ల మధ్య జరుగుతుంది. ఈ తటస్థ వేదికపై భారత్ - పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 27న జరగనుంది.

దక్షిణాసియా దేశాల్లో క్రికెట్‌కు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారని, ఇప్పుడు తాము ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ మీడియా రైట్స్‌ను దక్కించుకోవడం ద్వారా లైవ్ మ్యాచ్‌లను అభిమానులకు చూపించగలమని యప్ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతో పాటు అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్, ఒమన్, యూఏఈ జట్లు కూడా ఈ టోర్నమెంటు క్వాలిఫయింగ్ రౌండులో పాల్గొంటున్నాయి.

>
మరిన్ని వార్తలు