నాన్నకు ప్రేమతో.. జనిత్

6 Feb, 2016 21:02 IST|Sakshi
నాన్నకు ప్రేమతో.. జనిత్
 • సినిమాలో నాన్న కోసం ఏదైనా చేసే హీరోలను,హీరోయిన్‌లను చూస్తాం...
 •  ఆమె జీవితంలో రియల్ హీరో నాన్నే ...
 •  ఆయన తీరని కోరికను తాను నేరవేర్చాలనీ కంకంణం కట్టుకుంది...  
 •  కష్టాలను, అవమానాలను భరించింది...
 •  అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది... ‘‘హీరో’’అయ్యింది... 
 • ఎల్లలు దాటేలా చేసింది నాన్నపై ఆమెకు ఉన్న ప్రేమ. ఏ అమ్మాయి చేయని సాహసం చేసింది. ఉగ్రవాదుల కోటలో, తుపాకి తూటాల మధ్యలోంచి రహదారిని ఎంచుకొని... చివరికి లక్ష్యాన్ని చేరుకొంది.  తండ్రి కలను సాకారం చేసింది...

 •  తండ్రిపై ప్రేమ సాహసానికి ఊపిరూదింది...

  పాకిస్థాన్‌కు చెందిన జనిత్ ఇర్ఫాన్ (21) అనే అమ్మాయి నాన్నకు బైక్‌పై సుదూర ప్రాంతాల్ని చుట్టేయాలనే కోరిక ఉండేది. అది తీరకుండానే ఆయన చనిపోవడంతో తానే తండ్రి కోరికను పూర్తి చేయాలని ఆలోచించింది. బైక్ నడపడం అప్పటి వరకూ రాక పోయిన నేర్చుకొని ప్రయాణాన్ని ప్రారంభించాలని అనుకొంది.

  జనిత్ స్వస్థలం ఉత్తర పాకి స్థాన్‌లోని లాహోర్ ప్రాంతం. ఒక సారి తమ్ముడు 70సీసీ బైక్‌ని ఇంటికి తీసుకొచ్చాడు. జనిత్ బైక్ నేర్పమని తమ్మున్ని అడిగింది. ఆమె తల్లి కూడా బైక్ నేర్పమని కొడుక్కు చెప్పింది. ఆ సందర్భంలోనే తండ్రి కోరికను సాకారం చేయమని జనిత్‌ను  ప్రోత్సహించింది.

   కష్టాల కడలి నుంచి సంతోషాల తోటకు పయనం...


  జనిత్ మొదట్లో బైక్ నడపడం కష్టమనిపించేదని, ఒకే సమయంలో బైక్ గేర్, క్లచ్చ్, బ్రేక్స్‌ను వాడడం కష్టమయ్యేదని బైక్ నేర్చుకొనే తొలి నాటి అనుభవాలను గుర్తు చేసింది. తొలి నాళ్లల్లో లాహోర్ పరిసర ప్రాంతాల్లోనే చక్కర్లు కొట్టేది. 2015 జూన్ నెలలో తన తండ్రి తీరని కోరికని సాకారం చేసేందుకు మొదటి అడుగు వేసింది. ఆరు రోజుల్లో పాక్-చైనా-భారత్ సరిహద్దు ప్రాంతమైన కశ్మీర్  చేరుకొవాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఒంటరిగానే ప్రయాణించాలని నిర్ణయించుకుంది. కశ్మీర్‌ను చూడాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని కూడా వివరించింది. ఇస్లామాబాద్‌కు మొదట చేరువైంది. తర్వాత కొండలు, కోనలు, నదులు దాటుకుంటూ పాక్ ఆధీనంలోని కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి నీలం వ్యాలీ వరకూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. దారి వెంట గ్రామాల్లో ఆగుతూ అక్కడి జనాలతో ఫొటోలను తీసుకుంటూ సాగింది తన ప్రయాణం.   ప్రయాణంతో  ప్రేమ...

  3200 కిలోమీటర్లు ప్రయాణించాలని (లాహోర్ నుంచి చైనా సరిహద్దు ప్రాంతమైన ఖున్జరబ్ వరకూ) నిర్ణయించుకొంది. ప్రయాణం చేస్తున్న సమయంలో ఇతర  మహిళ బైక్ రైడర్లు జనిత్‌ను ప్రోత్సహించారు. తాము చూసిన పాకిస్థానీ మొదటి బైక్ రైడర్ అని జనిత్ ను ప్రశంసించారు. 20 రోజుల ప్రయాణంలో ప్రపంచంలోనే ఎత్తు అయిన పీఠభూమిగా పేరున్న డిసాయ్‌కు చేరుకొంది. కనీసం అక్కడ విశ్రాంతి  తీసుకునేందుకు ఆశ్రయం కల్పించే వారు కరువయ్యారు. అంతేకాకుండా స్థానికుల నుంచి జనిత్ కు  ప్రతికూల పరిస్థితులు సైతం ఎదురయ్యాయి. దారి వెంట ప్రమాదాలు జరిగిన తన ప్రయాణాన్ని ఏవీ ఆపలేక పోయాయి. భయాలకు, ప్రమాదాలకు భయపడి లక్ష్యాన్ని వదిలేయద్దని తన లాంటి వారికి జనిత్ సూచిస్తోంది.

   అడ్డంకులు దాటుకుంటూ...

  మహిళల్లో తక్కువ మంది బైక్ రైడర్స్ ఉన్నారని ఆమె తొలి అనుభవంలోనే గ్రహించింది. 'నేను అబ్బాయిల్లా దుస్తువులు ధరించి ప్రయాణాన్ని ప్రారంభించా. కొన్ని చోట్ల ఆగి దారి గురించి ఇతరులను అడిగాను. నా మాటను బట్టి నన్ను అమ్మాయని గుర్తించి నోరు వెళ్లబెట్టే వారు. ఆ లోపే అక్కడి నుంచి నేను బయలుదేరేదాన్ని. కొందరు అమ్మాయిలు బైక్ నడపకూడదని అనే వారు. కానీ దారి వెంట ఎదురైన కొంత మంది స్త్రీలు, సరిహద్దు దళాల సైనికులు మాత్రం వెన్నుతట్టి ప్రోత్సహించారు. మిఘర్ ప్రాంతంలో ఒక మహిళ నాతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆమె మాట్లాడే భాష వేరు. అక్కడే ఉన్న ఒక ట్రాన్స్‌లేటర్ తన మాటలను నాకు చెప్పాడు. ఆమాటాల అర్థం ...నువ్వు చేస్తున్న ఈ యాత్ర నమ్మశక్యం కానిది’. అంటూ  తన ప్రయాణ అనుభవాలను జనిత్ ఫేస్‌బుక్‌లో పంచుకొంది.


   సానుకూలతే మంచి ఆయుధం...

  ప్రయాణంలో బాధలు ఎదురైనా... చేరుకోబోయే ప్రాంతాల గురించి ఆలోచించడంతో ఏది బాధించేది కాదు. టీవీల్లో పేపర్‌లో చూసే మంచును మొదటి సారి ప్రత్యక్షంగా చూసాను. ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలసిపోయినప్పడు యోగా చేసేదాన్ని. ఖున్జరబ్ చేరుకొవడం జీవితంలో గొప్ప అనుభూతి. ఇప్పడు ఆ మధుర క్షణాలను తలుచుకుంటే భావోద్వేగానికి గురవుతానని జనిత్ పేర్కొంది.

   మరో ప్రస్థానం...

  జనిత్ ఒక వైపు యాత్రలను కొనసాగిస్తూనే,  చదువుల్లోనూ రాణిస్తోంది . త్వరలో ఆమె సింధులోని మిథ్ అనే గ్రామానికి వెళ్లాలని అనుకొంటోంది. మిథ్ ప్రతేక్యత ఏంటంటే అక్కడ హిందువులు, ముస్లింలు కలిసి నివసిస్తున్న ప్రాంతం. మరో పాంత్రం పాకిస్థాన్ స్విజ్జర్లాండ్‌గా పిలువబడే స్వేత్ వ్యాలీకి చేరుకోవాలని ప్రణాళికలు రచించుకుంటోంది. ప్రస్తుతం జనిత్ ఫేస్‌బుక్‌లో... జనిత్ ఇర్ఫాన్: వన్ గర్ల్ 2 వీల్స్ అనే పేరుతో  పర్సనల్ బ్లాగ్‌ను రన్ చేస్తోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా