గోడలు లేని హోటల్‌.. రోజుకు రూ.23 వేలు

5 Jun, 2020 15:27 IST|Sakshi

బెర్న్‌(స్విడ్జర్లాండ్‌) : సకల సదుపాయాలతో ప్రకృతి అందాల నడుమ జీవించాలనుకునే వారిని స్విడ్జర్లాండ్‌లోని ఓపెన్‌ ఎయిర్‌ హోటళ్లు ఆకర్షిస్తున్నాయి. తివాచి పరిచినట్టు ఉండే పచ్చని పచ్చిక బయళ్లు. చల్లని గాలులు వీచే చెట్లు. ఎటుచూసినా రమనీయమైన పర్వతాలు. ఆలపిస్తూ, ఆకృతినిచ్చే అందమైన నదుల మధ్య ఒక్క రోజు గడిపితే ఆ కిక్కే వేరు.

ఇలాంటి వారి కోసమే  స్విడ్జర్లాండ్‌కు చెందిన సోదరులు ఫ్రాంక్‌, పాట్రిక్‌లు డేనియల్‌ చార్బోన్నీర్‌తో కలిసి ఆల్ఫ్స్‌ పర్వతాల్లో ‘జీరో రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు’ను ప్రారంభించారు. మొత్తం ఏడు ఓపెన్‌ ఎయిర్‌ హోటళ్లను రూపొందించారు. ఈ హోటళ్లలో ఒక్కరోజు బసకుగానూ 308 డాలర్లు(దాదాపు రూ.23వేలు)గా నిర్ణయించారు.

గోడలు, టాప్‌లేకుండానే ఉండే ఈ హోటళ్లలో స్థానికంగా ఉండే రైతులే పర్యటకులకు రూమ్‌ సర్వీస్‌ చేస్తారు. ఇంత మంచి వెంటిలేషన్‌ ఉన్న ప్రదేశం బహుశా ఎక్కడా ఉండకపోవచ్చని ఫ్రాంక్‌, పాట్రిక్‌ సోదరులు అంటున్నారు. ముఖ్యంగా వేసవి విడిది కోసం ఈ హోటళ్లను రూపొందించామన్నారు. అయితే ఒకవేళ వర్షం గనుక పడితే బదులుగా మరో చోట బసకు ముందే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

చదవండి : ఇటలీపై కరోనా పంజా.. మెడికల్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

అమెరికా‌: పోలీసుల చర్యతో తల పగిలింది!

>
మరిన్ని వార్తలు