మోస్ట్‌ పవర్‌పుల్‌ పాస్‌పోర్ట్‌ గల దేశాల్లో భారత్‌ స్థానం..

2 Jun, 2018 19:37 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల్లో భారతదేశం 76వ స్థానంలో నిలిచింది. హెన్లే అండ్ పార్ట్‌నర్స్ పాస్‌పోర్ట్ ఇండెక్స్-2018 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. పాస్‌పోర్టు మాత్రమే ఉండి, ముందుగా వీసా తీసుకోకుండా ఎన్ని దేశాలకు వెళ్లగలరనే అంశం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 

జపాన్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ దేశ పాస్‌పోర్ట్‌తో 189 దేశాలకు ముందుగా వీసా లేకుండా వెళ్లోచ్చు. సింగపూర్, జర్మనీ సంయుక్తంగా రెండవ స్థానంలో( 188 దేశాలకు వెళ్లోచ్చు) నిలిచాయి. డెన్మార్గ్‌, ఫిన్లాండ్‌, ప్రాన్స్‌, ఇటలీ, స్వీడన్‌, స్పెయిన్‌ దేశాలు మూడో స్థానంలో నిలిచాయి.

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అధ్యయన సమాచారం ఆధారంగా 199 దేశాల పాస్‌పోర్టులు పరిశీలించి  ఈ ర్యాంకులను కేటాయించారు.

మరిన్ని వార్తలు