జగిత్యాల ప్రజావాణిలో కలకలం

8 Jan, 2018 13:25 IST|Sakshi

 దంపతుల ఆత‍్మహత్యాయత‍్నం

సాక్షి, జగిత్యాల: జగిత్యాల ప్రజావాణిలో సోమవారం కలకలం రేగింది. తండ్రి ఆస్తిని తనపేర విరాసత్‌ చేయడానికి రెవెన‍్యూ అధికారులు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ దంపతులు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప‍్పంటించుకునే ప్రయత‍్నం చేశారు.

రెవెన‍్యూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నిర‍్లక్ష‍్యంగా సమాధానం ఇస్తున్నారని, పైగా భారీ మొత‍్తం డబ్బులు లంచంగా డిమాండ్‌ చేస్తున్నారని ఎండి మౌలా అనే వ‍్యక్తి ఆవేదన వ‍్యక‍్తం చేశాడు. మౌలా దంపతులు సోమవారం ఉదయం జగిత్యాలకు వచ్చి రెవెన‍్యూ కార్యాలయం  ఎదుట ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత‍్మహత్యాయత‍్నం చేశారు. గమనించిన స్థానికులు, అధికారులు వెంటనే వారి వద‍్దకు వెళ్ళి వారించారు. వారిని ప్రజావాణి నిర‍్వహిస్తున‍్న అధికారుల వద‍్దకు తీసుకెళ్ళారు. సమస‍్యను పరిశీలించి పరిష‍్కరిస్తామని ఉన‍్నతాధికారులు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు