గర్భిణులకు 102 సేవలు

13 Feb, 2018 14:19 IST|Sakshi
గర్భిణుల కోసం వచ్చిన 102 వాహనం

తప్పిన రవాణా కష్టాలు

సబ్‌సెంటర్‌ వారీగా సేవలందిస్తున్న క్యాతూర్‌ పీహెచ్‌సీ

అలంపూర్‌ : గర్భిణులకు వైద్య సేవలే కాదు రవాణా కష్టాలు దూరమయ్యాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అమ్మఒడిలో భాగంగా 102 సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంత కాల ం బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఆపసోపాలతో ఆస్పత్రికి చేరిన గర్భిణులకు 102 వాహనసేవలు ఊరటనిస్తున్నాయి. 102 వాహనంలోనే ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షల అనంతరం అదే వాహనంలో ఇంటికి సురక్షింతంగా చేరుకుంటున్నారు. దీంతో బస్సులు, ప్రైవేటు వాహనాల కోసం నిరీక్షణ తప్పింది.

అలంపూర్, ఉండవెల్లి మండలంలోని క్యాతూర్‌ పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాలకు 102 ద్వారా సేవలందిస్తున్నారు. ప్రభుత్వం అమ్మఒడి పథకంలో భాగంగా 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగానే అలం పూర్, ఉండవెల్లి మండలాలకు సేవలం దించేలా ఒక వాహనం ఏర్పాటు చేశారు. ఇటివలే దాన్ని అలంపూర్‌ ఆస్పత్రిలో ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ప్రారంభిం చారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చి న వాహనం ద్వారా ఆయా గ్రామాల్లోని గర్భిణులను 102 వాహనం ద్వారా క్యా తూర్‌ పీహెచ్‌సీకి చేరవేస్తున్నారు. అనంతరం అదే వాహనంలో తిరిగి వారి ఇం టి వద్ద వదిలేస్తున్నారు. దీంతో సులభతరంగా ఆస్పత్రికి వచ్చి ప్రభుత్వ వైద్యశాలలోనే గర్భిణులు మహిళలు వైద్య సేవలు అందుకునే అవకాశం కలిగింది.
 
సబ్‌ సెంటర్ల వారీగా సేవలు..
క్యాతూర్‌ పీహెచ్‌సీలో సబ్‌సెంటర్ల వారీగా 102 ద్వారా సేవలందిస్తున్నారు. క్యాతూర్‌ పీహెచ్‌సీ పరిధిలో మొత్తం 7 సబ్‌సెంటర్లు ఉన్నాయి. క్యాతూర్‌ సబ్‌ సెంటర్‌లో క్యాతూర్, భీమవరం, యాపల్‌దేవిపాడు, అలంపూర్‌ సబ్‌ సెంటర్‌లో అలంపూర్, కాశీపురం సబ్‌ సెంట్‌లో కాశీపురం, ఇమాంపురం, బైరాపురం, బస్వాపురం, సింగవరం–1, సింగవరం–2, లింగనవాయి సబ్‌ సెంటర్‌లో లింగనవాయి, కోనేరు, ఉట్కూరు, తక్కశీల సబ్‌ సెంటర్‌లో తక్కశీల, ప్రాగటూరు, శేరుపల్లి, మారమునగాల–1, మారమునగాల–2, గొందిమల్ల సబ్‌ సెంటర్‌లో గొందిమల్ల, బుక్కాపురం, బైరన్‌పల్లి, సుల్తానాపురం సబ్‌సెంటర్‌లో సుల్తానాపురం, ర్యాలంపాడు, జిల్లెలపాడు గ్రామాలు ఉన్నాయి. ఈ సబ్‌ సెంటర్లలో ఒక్కో సబ్‌ సెంటర్‌కు ఒక్క రోజు కేటాయించి ఆ రోజు ఆయా గ్రామాల నుంచి ఆశ కార్యకర్తలు గర్భిణులను పీహెచ్‌సీకి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి వాళ్ల ఇళ్లకు చేర్చుతున్నారు.

సంతోషంగా ఉంది...
క్యాతూర్‌ పీహెచ్‌సీకి వైద్య పరీక్షల నిమిత్తం రా వడం ఇబ్బందిగా ఉండేది. సమయానికి బస్సులు, ఆటోలు రాక ఇబ్బందులు పడ్డాం. దీంతో సమయానికి చేరుకోలేక వైద్య పరీక్షలు చేయించుకోవడం కష్టంగా ఉండేది. 102 వాహనం రావడంతో ఆ కష్టాలు దూరమయ్యాయి. వైద్య పరీక్షలకు వెళ్లడానికి ఇబ్బందులు తొలగాయి. వాహనం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. 
– కృష్ణవేణి, గర్భిణి, ఉట్కూరు

సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం 102 సేవలు అందుబాటులోకి తెచ్చింది. అందుకే ఒ క్కో సబ్‌ సెంటర్‌ పరిధిలోని గ్రా మానికి ఒక రోజు కేటాయించాం. గర్భిణులు 102 వాహనంలో వచ్చి వైద్య సేవల అనంతరం తిరిగి వెళ్లవచ్చు. ఈ అవకాశం ప్రతి గర్భిణి సద్వినియోగం చేసుకోవాలి. 
– అనురాధ, పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్, క్యాతూర్‌

మరిన్ని వార్తలు