ఇదేం కక్కుర్తి

25 Jan, 2018 17:56 IST|Sakshi
ప్రిన్సిపాల్‌ను అడ్డుకుంటున్న ఏబీవీపీ నాయకులు 

గురుకుల పాఠశాల నుంచి సరుకులు తరలించిన ప్రిన్సిపాల్‌

పట్టుకుని నిలదీసిన ఏబీవీపీ కార్యకర్తలు

ఎల్లారెడ్డిరూరల్‌(ఎల్లారెడ్డి): పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ జ్యోతిలక్ష్మి హాస్టల్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న వస్తువులను ఏబీవీపీ నాయకులు పట్టుకుని నిలదీసి న సంఘటన ఎల్లారెడ్డిలో బుధవారం జరిగింది. ఏబీవీపీ నాయకులు ఓంకార్, తులసీరాంలు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల వార్డెన్‌గా విధులను నిర్వర్తిస్తున్న జ్యోతిలక్ష్మి బుధవారం మధ్యాహ్నం పాఠశాల నుంచి అక్రమంగా విద్యార్థులకు అందించాల్సిన మిరియాలు, పెసర్లు, నువ్వులు, ఆవాలు,  బెడ్‌ షీట్లు, స్టీల్‌ గిన్నెలను సంచిలో వేసుకుని ఇంటికి తరలిస్తుండగా పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో పట్టుకున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులకు అందించాల్సిన వస్తువులను ప్రతి సారీ సంచులలో తీసుకుని వెళ్తుందని వారు ఆరోపించారు. పట్టుకున్న వస్తువులను హాస్టల్‌కు తరలించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. స మాచారం అందుకున్న రెవెన్యూ అధి కారి గిర్దావార్‌ వెంకట్‌రెడ్డి పాఠశాలకు చేరుకుని పంచనామా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ సంచిలో 5కిలోల నువ్వులు, 5కిలోల ఆవాలు, 5కిలోల పెసర్లు, 5 బెడ్‌షీట్లు, 6స్టీల్‌ గిన్నెలు, 3కిలోల మిరి యాలను సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపా రు. నివేదికను తహసీల్దార్‌ అంజయ్యకు అందించనున్నట్లు ఆయన తెలిపారు.  

 

మరిన్ని వార్తలు