ప్రధానోపాధ్యాయుడికి అరెస్ట్‌ వారెంట్‌

6 Feb, 2018 16:55 IST|Sakshi
పాఠశాలలో విద్యాధికారి, ఎస్సై

అందుబాటులో లేని ప్రధానోపాధ్యాయుడు

గత నెల 27 నుంచి పాఠశాలకు డుమ్మా

గన్నేరువరం(మానకొండూర్‌): మండలంలోని మైలారం గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు చీటింగ్‌ కేసుకు సంబంధించి కరీంనగర్‌ కోర్టు నుంచి అరెస్ట్‌ వారెంట్‌ రావడంలో ఆ పాఠశాలలో అలజడి నెలకొంది. వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయుడిగా 2009లో మైలారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈయనపై ఒక చెక్‌ బౌన్స్‌ కేసులో అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయిందని, వాయిదా ప్రకారం కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్‌ బెయిల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను కోర్టు జారీ చేసిందని పోలీసులు తెలిపారు. ఈనెల 6తో గడువు ముగుస్తుండడంతో సోమవారం ఎస్సై వంశీకృష్ణ పాఠశాలకు వచ్చారు. ప్రధానోపాధ్యాయుడు అందుబాటులో లేవపోవడంతో.. మండల ఇన్‌చార్జి విద్యాధికారి లక్ష్మణ్‌రావును ఎస్సై ఫోన్‌లో సంప్రదించగా పాఠశాలకు చేరుకున్నారు. ప్రధానోపాధ్యాయుడిపై ఎంఈవో విచారణ చేపట్టారు. గత నెల 24 సాయంత్రం నుంచి 27 ఉదయం పూట పాఠశాలకు అధికారికంగా సెలవు తీసుకున్నారని తెలిపారు. సెలవులు ముగిసిన నుంచి తిరిగి పాఠశాలకు రావడం లేదని ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు, గ్రామస్తులు ఎంఈవోకు తెలిపారు. దీనిపై జిల్లా విద్యాధికారికి సైతం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు