బాబోయ్‌...సెల్‌ టవర్‌ మాకొద్దు

7 Mar, 2019 09:35 IST|Sakshi
ధర్నా నిర్వహిస్తున్న తెలుగు యువత నాయకులు 

సాక్షి, టవర్‌సర్కిల్‌: నగరంలోని శ్రీరాంనగర్‌కాలనీలో జనావాసాల మధ్య సెల్‌టవర్‌ను నెలకొల్పడాన్ని నిరసిస్తూ తెలుగు యువత నగర అధ్యక్షుడు జెల్లో జి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్శిటీ చౌరస్తా వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం రాస్తోరోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సెల్‌టవర్‌ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్‌తోపాటు కాలనీవాసులు అనారోగ్యం బారినపడతారన్నారు. అనుమతిని నగరపాలక సంస్థ వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జనావాసాల మధ్య టవర్‌ను ఎత్తేసి ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెల్లోజి శ్రీనివాస్, ఎర్రబెల్లి వినీత్, బీరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సాయిల్ల రాజమల్లయ్య, ఎర్రబెల్లి రవీందర్, బసాలత్‌ఖాన్, గొల్లె అమర్‌నాథ్, జావీద్, నర్సయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Karimnagar News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు