జయజయ.. జనగణమన

6 Feb, 2018 16:38 IST|Sakshi
గీతాలాపన చేస్తున్న ఏసీపీ, ఎంపీపీ

కొత్తపల్లిలో నిత్య జాతీయ గీతాలాపనకు శ్రీకారం

ఇక ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు..

కొత్తపల్లి(కరీంనగర్‌): విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ప్రయాణికులు కొత్తపల్లి మండలకేంద్రంలోని బస్టాండ్‌లో కరీంనగర్‌–జగిత్యాల రహదారిపై సోమవారం నిత్య జాతీయ గీతాలాపనకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు గీతాలాపన చేపడతారు. మై విలేజ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గీతాలాపన కార్యక్రమానికి కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ టి.ఉషారాణి, కరీంనగర్‌ ఎంపీపీ వాసాల రమేశ్‌ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు సమర్పించి జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ నిత్య గీతాలాపనతో సోదరభావం, ఐక్యత పెంపొందుతుందని చెప్పారు. ఎంపీపీ మాట్లాడుతూ జాతీయతను పెంపొందించేందుకు గీతాలాపన దోహదపడుతుందన్నారు. సర్పంచ్‌ వాసాల అ ంబికాదేవి, హైస్కూల్‌ హెచ్‌ఎం మంజుల, ఎస్సై పి.నాగరాజు, గ్రామస్తులు బండ గోపాల్‌రెడ్డి, గున్నాల రమేశ్, రుద్ర రాజు, స్వర్గం నర్సయ్య, ఫ క్రొద్దీన్, సాయిలు, మై విలేజ్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పెంటి నవీ న్, సభ్యులు శివగణేశ్, రామకృష్ణ, వెంకటేష్, శ్రీనాథ్, కొత్తపల్లి హైస్కూల్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు