అవకాశాలు అందిపుచ్చుకోవాలి 

23 Mar, 2018 16:17 IST|Sakshi
మాట్లాడుతున్న వెంకటేశ్వర్‌రావు

     డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు

జమ్మికుంటరూరల్‌(హుజూరాబాద్‌): యువత సంక్షేమం కోసం ప్రభుత్వం జాబ్‌మేళా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం నింపుతోందని, మేళాల్లో లభించే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(టీ సెర్ప్‌) ఆధ్వర్యంలో గురువారం జాబ్‌మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత పలు రకాల శిక్షణలు పొంది వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.

తల్లిదండ్రులకు భారం కావద్దని, ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. హెటోరో డ్రగ్స్, జీ4ఎస్, అపోలో ఫార్మసీ, ఇంటలెనెట్‌ గ్లోబల్‌ సర్వీస్, రిలయన్స్‌ ఫౌండేషన్, సుభగృహ ప్రాజెక్టు, బిగ్‌ బాస్కెట్, వరుణ్‌ మోటార్స్, నవత రోడ్‌ ట్రాన్స్‌పోర్టు, టాటా సర్వీస్‌ ప్రైవేటు సంస్థలకు ఇంటర్వ్యూ లు నిర్వహించారు. జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట మండలాల నుంచి 550 మంది యువతీయువకులు హాజరయ్యారు.

240 మంది ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం, 250 మంది వివిధ రంగాల్లో శిక్షణకు ఎంపికయ్యారు. ఎంపీపీ గంగారపు లత, నగర పంచాయతీ చైర్మన్‌ పోడేటి రామస్వామి, ఆర్థిక మంత్రి ఓఎస్‌డీ ప్రసాద్, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్‌ నిర్మల, ఎంపీడీవో రమేశ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు యుగేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు లింగారావు, కౌన్సిలర్‌ శీలం శ్రీనివాస్, ఏపీఎంలు రమాదేవి, శ్రీనివాస్, తిరుపతి, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు