ఫీల్డ్‌ అసిస్టెంట్లపై అధికారుల కొరడా 

7 Mar, 2019 12:27 IST|Sakshi
సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను విచారిస్తున్న అధికారి (ఫైల్‌)  

సాక్షి, శంకరపట్నం:  చెరువులు, కుంటల్లో ఫిష్‌పాండ్‌ పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. మండలం లోని 24 గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో ఫిష్‌ పాండ్, ఎస్సారెస్పీ కాలువ పూడితక తీత, హరిత హారంలో మొక్కల పెంపకం, పంట కాలువల త వ్వకం, కిచెన్‌షెడ్‌లు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు పనులుచేశారు. మండలంలో11వేల పైచిలుకు జాబ్‌కార్డులు ఉన్నాయి. జాబ్‌కార్డులలో 26 వేలవరకు కూలీలు ఈ పథకంలో పనులు చేస్తున్నారు. 2017 ఆగస్టు నుంచి ఏడాదిలో చేపట్టిన పనులపై సోషల్‌ఆడిట్‌ నిర్వహించారు. ఫిబ్రవరి 18న సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ ప్రజావేదికలో మండలంలో ఎక్కువ మొత్తంలో కూలీల కు అదనపు వేతనాలు చెల్లింపులు చేశారని  నివేది క ఇచ్చారు.   
 

వెలుగులోకి అక్రమాలు.. 
ఫిష్‌పాండ్‌ నిర్మాణాల్లో కూలీలు చేసిన పనికి అద నంగా వేతనాలు చెల్లించేటట్లు కొలతలు తీశారని తేలింది. మండలంలోని  కరీంపేట, కొత్తగట్టు, లింగాపూర్,రాజాపూర్, చింతలపల్లె, ధర్మారం, మెట్‌పెల్లి గ్రామల ఫీల్డ్‌అసిస్టెంట్లపై ఆరోపణలు రావడంతో సస్పెన్సన్‌ చేసినట్లు డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు ఆదేశాలు జారీచేశారు. మండలవ్యాప్తంగా రూ.15,95,844 చేసిన పనుల కంటే అత్యధికంగా కూలీలకు వేతనాలు చెల్లించినట్లు సోషల్‌ ఆడిట్‌లో వివరాలు వెల్లడయ్యాయి. కూలీల చేత పనులు చేయించాల్సిన ఫీల్డ్‌అసిస్టెంట్లు చేయని ప నులకు రూ. లక్షల్లో వేతనాలు చెల్లించడానికి కారుకులయ్యారని తేలింది.

అత్యధికంగా కరీంపేటలో రూ.7.32 లక్షలు, చింతలపల్లెలో రూ.2.41 లక్షలు  మెట్‌పల్లిలో రూ.1.13లక్షలు, కొత్తగట్టులో రూ.1. 10 లక్షలు, రాజాపూర్‌ రూ.32వేలు, లింగాపూర్‌ రూ.26వేలు అదనంగా కూలీలకు చెల్లించినట్లు తే లింది. మెట్‌పల్లి ఫీల్డ్‌అసిస్టెంట్‌ స్రవంతి భర్త మధు ఉపాధిహామీ పనులు చేయకున్నా పనులు చేసినట్లు రూ.19వేల వేతనం చెల్లింపులు చేసినందుకు గతనెల 18న సస్పెన్సన్‌ చేసిన విషయం విధిత మే. ఉపాధిహామీ పథకంలో అక్రమలు వెలుగు చూడడంతో కరీంపేట ఫీల్డ్‌అసిస్టెంట్‌ సల్మా, కొత్తగట్టు ఫీల్డ్‌అసిస్టెంట్‌ కలీషా, చింతలపల్లె చంద్రమౌళి, లింగాపూర్‌ ఫీల్డ్‌అసిస్టెంట్‌ రవి, ధర్మారం ఫీల్డ్‌అసిస్టెంట్‌ శంకర్, రాజాపూర్‌ ఫీల్డ్‌అసిస్టెంట్‌ ప్రభాకర్‌ను సస్పెన్సన్‌ చేస్తూ డీఆర్‌డీవో ఆదేశాలు జారీచేయడం సంచలనం కలిగించింది.  
 

రూ.15 లక్షల రికవరీ.. 
ఉపాధిహామీ పథకంలో కూలీలకు అదనంగా వేతనాలు చెల్లింపులు చేయడానికి కారణమైన ఫీల్డ్‌అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, జేఈల నుంచి రూ. 15,95,844 రికవరీ చేసేందుకు  నోటీసులు జారీచేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సస్పెన్సన్‌కు గురైన ఫీల్డ్‌అసిస్టెంట్లు 14 రోజుల్లో వివరణ ఇవ్వా లని డీఆర్‌డీవో జారీచేసిన మెమోలో సమాచారం అందించారు.  

మరిన్ని వార్తలు