మహిళల భద్రత కోసమే షీటీంలు

12 Mar, 2019 13:03 IST|Sakshi
మాట్లాడుతున్న సీఐ సంతోష్‌కుమార్‌ 

సాక్షి, కరీంనగర్‌ క్రైం: మహిళలు, విద్యార్థినుల భద్రత కోసమే షీటీంలు పని చేస్తున్నాయని మహిళ పోలీస్‌స్టేషన్‌ సీఐ సంతోష్‌కుమార్‌ అన్నారు. కరీంనగర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో షీటీంల పనితీరుపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో సీఐ మాట్లాడారు. వేధింపులు ఎదుర్కొనే మహిళలు వాట్సప్, ఫేస్‌బుక్‌ ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. షీటీంనకు చెందిన పోలీసులు మఫ్టీలో సంచరిస్తూ పోకిరీలను ఆధారాలతో పట్టుకుంటున్నారని అన్నారు. స్మార్ట్‌ఫోన్‌ కలిగిన ప్రతీపౌరుడు హాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ఈయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో సీఐతో మహిళ ఠాణా ఏఎస్సై విజయమణి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.  


 

మరిన్ని వార్తలు