స్వచ్ఛ సర్వేక్షణ్‌–2018 సర్వే

10 Jan, 2018 06:45 IST|Sakshi

కరీంనగర్‌ కార్పొరేషన్‌: స్వచ్ఛభారత్‌ మిషన్, కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 4041 నగరాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌–2018లో భాగంగా మంగళవారం ఢిల్లీ బృందం నగరంలో పర్యటించింది. ముగ్గురు సభ్యుల బృందం నగరానికి చేరుకోగా నగరపాలక పారిశుధ్య సిబ్బందికి తెలియకుండానే రెండు రోజులపాటు పర్యటించినట్లు తెలిసింది. ఇద్దరు సభ్యుల బృందం పలు డివిజన్లలో పర్యటించి, వివరాలు సేకరించినట్లు సమాచారం. ఒకరు కార్పొరేషన్‌ కార్యాలయంలో డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తెలిసింది. రెండు రోజులు సుమారు 10 డివిజన్లలో పర్యటించి, పారిశుధ్య పరిస్థితిపై ఫొటోలు తీయడంతోపాటు స్థానికులను అడిగి పలు విషయాలపై అవగాహనకు వచ్చినట్లు తెలిసింది.

ఢిల్లీ నుంచే సూచనలు..
నగరానికి వచ్చిన బృందం సభ్యులు ఎక్కడికి వెళ్లాలి.. ఏయే విషయాలు పరిశీలించాలనే అంశాలకు సంబంధించి ఢిల్లీ నుంచే సూచనలు అందాయి. కరీంనగర్‌ చేరుకునే వరకు ఇక్కడి పరిస్థితులపై ఎలాంటి అవగాహన లేని సభ్యులు వారికి సెల్‌ఫోన్‌ ద్వారా అందిన లొకేషన్లు, ఇంటి నంబర్ల ఆధారంగా డివిజన్లలో పర్యటించారు. పలు కాలనీలకు వెళ్లి స్వచ్ఛ టాయిలెట్ల నిర్మాణం, ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ, డ్రెయినేజీల శుభ్రత, రోడ్లు ఊడ్చడం, రైతు బజార్లు, మార్కెట్లు తదితర అంశాలపై ఆరా తీశారు. వెంటవెంటనే ఫొటోలు తీస్తూ అప్‌లోడ్‌ చేశారు. దీంతో నేరుగా ఢిల్లీ నుంచే ఫోన్‌లు చేసి ప్రజల ద్వారా పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు.

కార్యాలయంలో డాక్యుమెంట్ల పరిశీలన..
నగరపాలక సంస్థలో స్వచ్ఛ భారత్‌ పనుల నిర్వహణపై అధికా రులు నమోదు చేస్తున్న రికార్డులు, డాక్యుమెంట్లను ఢిల్లీ బృం దం సభ్యుడు పరిశీలించారు. ఢిల్లీకి పంపించిన రికార్డులు, ఇక్క డ నిర్వహిస్తున్న రికార్డులను సరిచూశారు. శానిటేషన్‌ పనులు నిర్వహణ తీరును రికార్డుల్లో పర్యవేక్షించారు. డివిజన్లలో సి బ్బంది కేటాయింపు, నైట్‌ స్వీపింగ్, ప్రధాన రహదారులను శు భ్రపరచడం పనులు ఎలా జరుగుతున్నాయని తెలుసుకున్నారు.

మరో రెండు రోజులు..: మొదటి రెండు రోజులు డివిజన్లలో పర్యటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం, బుధ, గురువారాల్లో కూడా నగరంలో శానిటేషన్‌ పనులు, చెత్త సేకరణ, చెత్త కలెక్షన్‌ పాయింట్లు, వాహనాల ద్వారా చెత్త తరలింపు, డంప్‌యార్డు నిర్వహణపై పర్యవేక్షించనుంది. నాలుగు రోజుల షెడ్యూల్‌ ఉన్నప్పటికీ మూడు రోజుల్లోనే ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణŠ బృందం ఇచ్చే మార్కులపైనే నిధుల రాబడి ఆధారపడి ఉన్నందునా డివిజన్లలో శానిటేషన్‌ పనులు పక్కాగా చేపడుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచి ర్యాంకు సాధించి భారీగా నిధులు పొందాలనే అధికారులు చేసిన కసరత్తు ఫలితమిస్తుందో లేదో చూడాల్సిందే..!!

మరిన్ని వార్తలు