నివేదితను పెళ్లాడిన చందన్‌ శెట్టి

27 Feb, 2020 08:33 IST|Sakshi

‘బిగ్‌బాస్‌’ విన్నర్‌ మూడుముళ్ల బంధం

మైసూరు: కన్నడ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ విన్నర్, కన్నడ ప్రముఖ ర్యాపర్‌ గాయకుడు చందన్‌శెట్టి, నివేదితా గౌడ బుధవారం మూడుముళ్లతో ఒక్కటయ్యారు. మైసూరులోని హుణసూరు రోడ్డులో ఉన్న హినకల్‌లోని ఫంక్షన్‌ హాల్లో వీరిద్దరి వివాహం వేడుకగా జరిగింది. నివేదితా తల్లిదండ్రులు హేమా, రమేష్, దంపతులు, చందన్‌శెట్టి తల్లిదండ్రులు  ప్రేమలతా, పరమేష్‌లు, బంధుమిత్రులు, పలువురు సినీనటులు కొత్త జంటను ఆశీర్వదించారు. 

కన్నడ  ప్రముఖ సినినటుడు పవర్‌ స్టార్‌ పునిత్‌ రాజ్‌కుమార్‌ దంపతులు కొత్త జంటను ఆశీర్వదించారు. చందన్‌శెట్టి మాట్లాడుతూ ‘పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను. ఇక పైన నాతో పాటు నా భార్య నివేదితా కూడా ఉంటుంది’ అని సంతోషంగా తెలిపారు. వధువు నివేదితా గౌడ మాట్లాడుతూ తన జీవితంలో చాలా గొప్ప రోజు అని, ఈ శుభదినాన్ని ఎప్పుడు కూడా మరిచిపోనని అన్నారు.   

సుదీప్‌.. జూదం ఆడమంటావా? 
ప్రముఖ నటుడు సుదీప్‌ ఇస్పేట్‌ జూదం ప్రకటనల్లో కనిపించటంపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. జూదాన్ని సుదీప్‌ ప్రోత్సహించేలా చేస్తున్నట్లు ఆరోపిస్తూ వివిధ కన్నడ సంఘలు బుధవారం బెంగళూరులో నిరసన ప్రదర్శన నిర్వహించాయి. జూదం ఆడండి, డబ్బులు సంపాదించండి అని ఆన్‌లైన్‌లో సుదీప్‌ ప్రకటనలు చేయడం తగదన్నారు. యువతను తప్పుదారి పట్టించేలా ఉందని, ఆయన కన్నడ సినిమాల నుండి నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాలి గానీ ఇలాంటి ప్రకటనల్లో నటించడం సబబు కాదని హితవు పలికారు.   

Read latest Karnataka News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు