కన్నడనాట కరోనా మృత్యుకేళి 

12 Jul, 2020 08:39 IST|Sakshi

కరోనాతో 70 మంది మరణం  

కొత్తగా 2,798 కేసులు  

రికార్డుస్థాయిలో కోవిడ్‌ విధ్వంసం 

సాక్షి, బెంగళూరు: కన్నడనాట కోవిడ్‌–19 విధ్వంసానికి అంతులేకుండా పోతోంది. శనివారం ఒకేరోజులో 70 మంది కరోనా కోరలకు బలి అయ్యారు. మరో 2,798 మంది కరోనా బారిన పడ్డారు. అన్ని జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు తేలాయి. పర్యాటక మంత్రి సీటీ రవికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 36,216కు ఎగబాకాయి. మరణాలు 613ను చేరాయి. 880 మంది డిశ్చార్జ్‌  కోవిడ్‌ నుంచి కోలుకుని 880 మంది రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జ్‌లు మొత్తం 14,716కు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 20,883 యాక్టివ్‌ కేసులు ఉండగా అందులో 504 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.  

బెంగళూరులోనే అధికం  
తాజా కేసుల్లో 1,533 బెంగళూరులోనే తేలాయి. 404 మంది డిశ్చార్జి అయినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఫలితంగా బెంగళూరులో మొత్తం కేసులు 16,862కు పెరిగాయి. డిశ్చార్జుల సంఖ్య 3,839కు చేరింది. మొత్తం 229 మరణాలు నమోదయ్యాయి. నగరంలో ప్రస్తుతం 12,793 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో బెంగళూరులో మరో 23 మంది కోవిడ్‌ సోకి మృత్యువాత పడ్డారు.  
(చదవండి: ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయబోతే ఖాతా ఖాళీ)

600 దాటిన మరణాలు 
కరోనా కాటుకు రాష్ట్రంలో మరో 70 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 613కు పెరిగింది. తాజా మరణాల్లో బెంగళూరులో 23, మైసూరులో 8, దక్షిణ కన్నడలో 5, శివమొగ్గలో 3, గదగ్‌లో 3, ధారవాడలో 3, దావణగెరెలో 3, భాగల్‌కోటెలో 2, హాసనలో 2, విజయపురలో 2, తుమకూరులో 2, కలబురిగిలో 2, కొప్పళలో 2, బెళగావిలో 2, చిక్కబళ్లాపురలో 2, రాయచూరులో 1, ఉత్తర కన్నడలో 1, హావేరిలో 1, బీదర్‌లో 1, బళ్లారిలో 1, రామనగరలో ఒక మరణం చొప్పున నమోదయ్యాయి. ఇప్పటి వరకు బెంగళూరులో 229, బీదర్‌లో 53, బళ్లారిలో 42, కలబురిగిలో 36, దక్షిణ కన్నడలో 36, ధారవాడలో 32, మైసూరులో 28 మంది ఉన్నారు.  
(చదవండి: అల్లుని కుటుంబంపై కత్తులతో దాడి)

ఏ జిల్లాలో ఎన్ని    కేసులంటే.. 
బెంగళూరులో 1,533, దక్షిణ కన్నడలో 186, ఉడుపిలో 90, మైసూరులో 83, తుమకూరులో 78, ధారవాడలో 77, యాదగిరిలో 74, దావణగెరెలో 72, బళ్లారిలో 65, కలబురిగిలో 65, బీదర్‌లో 63, విజయపురలో 48, ఉత్తర కన్నడలో 40, గదగ్‌లో 40, బాగల్‌కోటెలో 37, హాసనలో 34, రామనగరలో 30, శివమొగ్గలో 26, కొప్పళలో 23, మండ్యలో 23, చిక్కబళ్లాపురలో 20, చామరాజనగరలో 17, హావేరిలో 16, రాయచూరులో 14, కోలారులో 12, కొడగులో 12, చిత్రదుర్గంలో 9, బెంగళూరు రూరల్‌ 5, బెళగావిలో 3, చిక్కమగళూరులో 3 కేసులు చొప్పున నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు