టూరిస్టు వీసాలతో విదేశాలకు వెళ్లి మోసపోవద్దు

10 Oct, 2017 20:22 IST|Sakshi

కర్ణాటక: ప్రైవేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ల ద్వారా పర్యాటక వీసాలతో ఇతర దేశాలకు వెళ్లి మోసపోవద్దని శ్రీలంక శరణార్థులను హొసూరు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో హెచ్చరించారు. తమిళనాడులో పలు ప్రైవేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఏజెన్సీలు శ్రీలంక శరణార్థులను ఇతర దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని పర్యాటక వీసాలతో పంపుతున్నారు. దీన్ని నమ్మి ఇతర దేశాలకు వెళ్లిన శ్రీలంక శరణార్థులు తిండీతిప్పలు మాని చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు.

ప్రైవేట్‌ ఎంప్లామెంట్‌ శాఖలను నమ్మి విదేశాలకు వెళ్లరాదని కలెక్టర్‌ హెచ్చరించారు. 2016లో 250 మంది, 2017లో 186 మంది అరబ్‌ దేశాలకు పర్యాటక వీసాతో వెళ్లి మోసపోయారన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్రైవేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఏజెన్సీల ద్వారా పర్యాటక వీసాతో వెళ్లిన 17 మంది కూడా అదే స్థితికి చేరుకొన్నారని, విషయం తెలుసుకొన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం వారిని వెనక్కి రప్పించుకొందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు