ముదిరిన ‘కర్ణాటక’ కష్టాలు

5 Jun, 2019 07:21 IST|Sakshi

జేడీఎస్‌ అధ్యక్ష పదవికి విశ్వనాథ్‌ రాజీనామా 

కాంగ్రెస్‌లోనూ అంతర్గత కుమ్ములాటలు 

బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్‌–కాంగ్రెస్‌ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం వరుస షాక్‌లతో సతమతమవుతోంది. తాజాగా జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.హెచ్‌.విశ్వనాథ్‌ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడకు అందజేశారు. సంకీర్ణ ప్రభుత్వం సరైన రీతిలో పనిచేసేందుకు గాను సిద్దరామయ్య నేతృత్వంలో ఏర్పాటైన సమన్వయ కమిటీ ఏడాది గడుస్తున్నా ఉమ్మడి ప్రణాళికను రూపొందించలేకపోయిందని మండిపడ్డారు. ఇరు పార్టీల మధ్య సమన్వయానికి సిద్ధరామయ్య చర్యలు తీసుకోలేదన్నారు. తుముకూరులో మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమి వెనుక కుట్ర ఉందని ఆరోపణలు చేశారు.  

కాంగ్రెస్‌లో ధిక్కార స్వరం
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రామలింగారెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తీసుకున్న పలు నిర్ణయాలపై మండిపడుతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్లకి, ఇతర పార్టీల నుంచి చేరిన వారికి, కాంగ్రెస్‌ విధానాలు తెలియని వారికి ప్రాధాన్యత ఇవ్వడమే పార్టీ ప్రస్తుత స్థితికి కారణమని ధ్వజమెత్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే సీనియర్‌ నేతలు పార్టీలో ఉండలేరని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రోషన్‌ బేగ్‌ సైతం ప్రస్తుత కాంగ్రెస్‌ పరిస్థితికి సిద్దరామయ్య, దినేశ్‌ రావులే కారణమని మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. సిద్దరామయ్య పొగరు వల్లే పార్టీ ఇలా తయారైందన్నారు.

Read latest Karnataka News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుమారస్వామికి గవర్నర్‌ డెడ్‌లైన్‌

కర్ణాటకం : విశ్వాస పరీక్ష రేపటికి వాయిదా

కర్ణాటకం : గవర్నర్‌ సూచనతో మారిన సీన్‌

కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం

కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా

ఆస్పత్రిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!

కుమారస్వామి ఉద్వేగం

టైర్‌ పేలి లారీని ఢీకొన్న ఇన్నోవాకారు

ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!

కర్ణాటక రాజకీయాలపై కాంగ్రెస్‌ ఆసక్తికర ట్వీట్‌

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

కోడలికి కొత్త జీవితం

రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై రేపు సుప్రీం తీర్పు

ఐఏఎఫ్‌లో చేరనున్న అమర జవాన్‌ భార్య

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ అరెస్ట్‌

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

కథ బెంగళూరు చుట్టూనే..

‘కోట్ల’ కర్నాటకం

18న బలపరీక్ష

‘నేను పెద్ద తప్పు చేశా.. ఇండియాకు వచ్చేస్తున్నా’

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

మాట్లాడుతుండగా పేలిన సెల్‌ఫోన్‌

సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌

కర్ణాటకం : కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతల కీలక భేటీ

సమయం లేదు కుమార..

‘పులుల్లా పోరాడుతున్నాం’

కర్ణాటకం : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యూటర్న్‌..!

కర్ణాటక సంక్షోభం.. ఎమ్మెల్యేలకు రాజభోగాలు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం