కర్ణాటకకు 'కైర్‌' తుఫాను ముప్పు

27 Oct, 2019 16:35 IST|Sakshi

బెంగుళూరు : అరేబియన్‌ సముద్రంలో ఏర్పడిన 'కైర్‌' తుఫాను ప్రభావంతో కర్ణాటక తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం రాత్రి వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణశాఖ అధికారి జీ.ఎస్‌. శ్రీనివాస్‌రెడ్డి  మాట్లాడుతూ.. ముంబై పశ్చిమానికి  నైరుతి దిశలో 540 కిలోమీటర్ల​ దూరంలో ఏర్పడిన 'కైర్‌' తుఫాను క్రమంగా బలపడుతూ 'సూపర్‌ సైక్లోనిక్‌ తుఫానుగా' రూపాంతరం చెందుతున్నట్లు పేర్కొన్నారు.  ఇప్పటికే ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా కర్ణాటక రీజియన్‌లోనూ ఆదివారం రాత్రి నుంచి రెండు రోజులు వర్షాలు కురిసి అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. కైర్‌ తుఫాను ప్రభావంతో గోవా, కర్నాటక ప్రాంతాంల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించామని, శనివారం నుంచే ఈ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తీర ప్రాంతంలో జాలర్లు ఎవరు చేపల వేటకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రాబోయే ఐదు రోజుల్లో 'కైర్‌' తుఫాను ఒమన్‌ తీరానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.


 

మరిన్ని వార్తలు