ఐఏఎఫ్‌లో చేరనున్న అమర జవాన్‌ భార్య

16 Jul, 2019 12:11 IST|Sakshi

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరనున్న గరిమా అబ్రోల్‌

భర్త సమీర్‌ అబ్రాల్ విమాన ప్రమాదంలో మృతి

సాక్షి, బెంగుళూరు : మిరాజ్‌-2000 విమాన ప్రమాదంలో మరణించిన స్క్వాడ్రన్‌ లీడర్‌ సమీర్‌ అబ్రాల్ (33) భార్య గరిమా అబ్రోల్‌ భారత వైమానిక దళంలో చేరనున్నారు. ఈమేరకు రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ అనిల్‌ చోప్రా ట్విటర్‌లో పేర్కొన్నారు. గరిమాను అసాధాణ స్త్రీగా ఆయన అభివర్ణించారు. తెలంగాణలోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీలో వచ్చే ఏడాది జనవరికల్లా ఆమె చేరనున్నారని తెలిపారు. ‘దేవుడు మహిళలందరినీ ఒకేలా కాకుండా.. కొందరిని సాయుధ జవాన్ల భార్యలుగా సృష్టిస్తాడు’ అని అన్నారు. దాంతోపాటు సమీర్‌, గరిమా కలిసున్నప్పటి ఫొటో, ఆమె శిక్షణలో ఉన్న ఫొటో ట్వీట్‌ చేశారు. మిరేజ్‌–2000 రకం శిక్షణ యుద్ధ విమానం టేకాఫ్‌ అవుతుండగా కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన బెంగళూరు సమీపంలోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) విమానాశ్రయంలో ఫిబ్రవరి 1న జరిగింది. ఎయిర్‌క్రాఫ్ట్‌ అండ్‌ సిస్టమ్స్‌ టెస్టింగ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగానికి చెందిన పైలట్లు స్క్వాడ్రన్‌ లీడర్‌ సమీర్‌ అబ్రాల్, స్క్వాడ్రన్‌ లీడర్‌ సిద్ధార్థ నేగి (31) ఈ ప్రమాదంలో అమరులయ్యారు.

(చదవండి : శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్ల మృతి)

మరిన్ని వార్తలు