రామదాసుకు అంతర్జాతీయస్థాయి కీర్తి కోసం కృషి

21 Jan, 2018 17:24 IST|Sakshi

మంత్రి తుమ్మల

సాక్షి, నేలకొండపల్లి: రామయ్య పరమ భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న(రామదాసు)కు అంతర్జాతీయస్థాయిలో కీర్తిని తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక రామదాసు ధ్యాన మందిరంలో భక్త రామదాసు జయంత్యుత్సవాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ఈ మందిరం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గత ఏడాది మాట ఇచ్చారని, దానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. భక్త రామదాసు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసినట్లే ఆయన స్మృతి భవనాన్ని కూడా త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రామదాసు వంటి మహనీయుడి చరిత్రను ప్రపంచమంతా తెలుసుకునేలా ప్రచారం చేయాలని తుమ్మల సూచించారు. ఇక్కడ బౌద్ధ క్షేత్రంతోపాటు బాలసముద్రం చెరువును కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
effort for International glory to Ramadas:Tummala

మరిన్ని వార్తలు