ప్రజా సంక్షేమానికే కొత్త పార్టీ

18 Mar, 2018 10:28 IST|Sakshi

ఖమ్మంమామిళ్లగూడెం: కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో  ప్రశ్నించే వారిని టార్గెట్‌గా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని, టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. ప్రజాసంక్షేమం కోసమే తాను పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పార్టీ విధివిధానాలను వెల్లడిస్తానన్నారు. శనివారం బడ్జెట్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం ఒక విధానం ప్రకారం నడుస్తే బాగుంటుందని చెప్పిన తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఈ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కాంట్రాక్టర్ల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ సర్కార్‌ పని చేస్తోందన్నారు. అందుకే రాజకీయ ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. తాను బీజేపీనుంచి కోదండరామ్‌ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో టీజేఏసీ జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ శీలం పాపారావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు