‘అమ్మా’నుషం

12 Mar, 2019 12:21 IST|Sakshi
తాటి రత్తమ్మ మృతదేహం   

ఆస్తి తగాదాలతో పిన్నిఅంత్యక్రియలు ఆపేసిన కొడుకులు  

రెండు రోజుల తర్వాత గ్రామస్తుల చొరవతో దహన సంస్కారాలు 

సాక్షి, పాల్వంచ: చనిపోయి నిర్జీవంగా పడి ఉంటే..ఆస్తి తగాదాలతో చివరికి సంస్కారం మరిచి పంతాలకు పోయారు. పాల్వంచ పట్టణ పరిధిలో గల బంగారు జాల గ్రామానికి చెందిన తాటి రత్తమ్మ(65) వృద్ధాప్యంతో ఈ నెల 9వ తేదీన ఉదయం మృతి చెందింది. తాటి సమ్మయ్యకు మొదటి భార్య మృతి చెందడంతో రెండో భార్యగా రత్తమ్మను పెళ్లి చేసుకున్నాడు.

మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు కాగా రత్తమ్మకు మాత్రం సంతానం కలగక పోవడంతో ఓ బాబును దత్తత తీసుకుని పెంచారు. అతడి పేరు రవికుమార్‌. సమ్మయ్య గత పదేళ్ల క్రితమే మృతి చెందాడు. తాజాగా రత్తమ్మ చనిపోవడంతో వారసత్వంగా వచ్చే భూమిని నలుగురు కొడుకులు సమానంగా తీసుకోవాల్సి ఉండగా..పెంచుకున్న కొడుక్కి మనసిక స్థితి సరిగ్గా లేదనే నెపంతో ఇవ్వకుండా పేచి పెట్టారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో ముగ్గురు కొడుకులు అంత్యక్రియలకు సహకరించకుండా వెళ్లి పోయారు.

దీంతో గత రెండు రోజులుగా దహన సంస్కారాలు నిర్వహించకుండా ఇంట్లోనే రత్తమ్మ మృత దేహాన్ని అలానే ఉంచారు. చివరికి పట్టణ ఎస్‌ఐ ముత్యం రమేష్, గ్రామస్తుల చొరవతో సోమవారం అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు.  

మరిన్ని వార్తలు