తల్లిదండ్రులపై ‘కృషి’ వెంకటేశ్వరరావు దాడి

5 Jan, 2018 13:23 IST|Sakshi
‘కృషి బ్యాంక్‌’ వెంకటేశ్వరరావు(ఫైల్‌ ఫొటో)

సాక్షి, విజయవాడ : కృషి బ్యాంకు కుంభకోణం సూత్రధారి కోసరాజు వెంకటేశ్వరరావుపై ఆయన తల్లిదండ్రులే కేసు పెట్టారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడకు చెందిన కోసరాజు జయసింహ-బేబి సరోజినీలపై వారి కొడుకులైన వెంకటేశ్వరరావు, వేణుగోపాల్‌లు దాడికి పాల్పడ్డారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు ఇద్దరు కొడుకులపై పెదపారుపూడి పోలీసులు కేసు నమోదుచేశారు. ఆస్తి విషయంలో తలెత్తిన విబేధాలే దాడికి కారణమని తెలిసింది.

కృషి బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు వెంకటేశ్వరరావు. బ్యాంకు డిపాజిటర్లకు ఎక్కువ మొత్తంలో వడ్డీ(16.5 శాతం) ఇస్తానని ఆశలు చూపి భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. కుంభకోణం వెలుగులోకి రావడంతో చాకచక్యంగా 2001 జూలైలో భార్యతో కలిసి యూకే పారిపోయాడు. అక్కడ పౌరసత్వం రాకపోవడంతో మళ్లీ థాయిలాండ్‌కు పారిపోయాడు. ఈ విషయం హైదరాబాద్‌ పోలీసులకు తెలియడంతో బ్యాంకాక్‌ పోలీసులు, ఇంటర్‌ పోల్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో 2005లో బ్యాంకాక్‌లో వెంకటేశ్వర రావును అరెస్ట్‌ చేశారు. 2006, జూన్‌లో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. తల్లిదండ్రులపై దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

మరిన్ని వార్తలు