వారెవ్వా.. మాగ్నోవా

21 Jan, 2018 12:37 IST|Sakshi

అందమైన భామలు.. లేత మెరుపు తీగలై క్యాట్‌వాక్‌ చేసుకుంటూ వస్తుంటే, అబ్బాయిలు నవ మన్మథులై ర్యాంప్‌పై నడిస్తే.. చూసేందుకు రెండు కళ్లూ చాలవు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో శనివారం జరిగిన మాగ్నోవా–2018లో విద్యార్థుల ఫ్యాషన్‌ షో కనుల నిండుగా జరిగింది. అంతకుముందు కళాశాలలో ‘ఛలో’ హీరో నాగశౌర్య సందడి చేశారు.లేటెస్ట్‌ డిజైన్‌ డ్రెస్సుల్లో మెరుపుతీగల్లా మగువలు, హుందాతనం ఒట్టిపడే దుస్తుల్లో మగవారు.. ర్యాంప్‌పై నడిచి ఆకట్టుకున్నారు. కొత్తదనం డిజైన్లతో విద్యార్థులు క్యాట్‌వాక్‌ చేస్తుంటే సహచరులు సందడి చేశారు. 

విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఎంబీఏ విభాగం, స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మాగ్నోవా–2018లో విద్యార్థుల ఫ్యాషన్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యంగ్‌ మేనేజర్, మార్కెటింగ్, సెల్ఫ్‌ ఈవెంట్స్, కో–ఆర్డినేషన్‌ ఈవెంట్స్, ట్రెజర్‌ హంట్, పోస్టర్‌ మేకింగ్‌ పోటీల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. అనంతరం జరిగిన నృత్యాలు ఆకట్టుకున్నారు.

నైపుణ్యాలు పెంచుకోండి
పాఠ్యాంశాలను నేర్చుకోవడంతో పాటు ఆ అంశాల్లో నైపుణ్యాలను పెంచుకోవాలని, అప్పుడే ఉపాధి అవకాశాలు లభిస్తాయని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ సెక్రటరీ డాక్టర్‌ ఆర్‌.మనోజ్‌కుమార్‌ తెలిపారు. మాగ్నోవా–2018 ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.రమేష్, డీన్‌ రాజేష్‌ సి.జంపాల, డైరెక్టర్‌ బాబూరావు మాట్లాడుతూ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని పెంచేందుకు తమ కళాశాలలో ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మాగ్నోవా కన్వీనర్‌ రమేష్‌ చంద్ర, మేనేజ్‌మెంట్‌ విభాగం అధ్యాపకులు బి.సుమలత, కె.విజయ్, వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు.    – మొగల్రాజపురం(విజయవాడ తూర్పు)

మరిన్ని వార్తలు