పొగమంచు.. విమానాలకు అంతరాయం

17 Jan, 2018 10:53 IST|Sakshi

దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు ఆలస్యం

గన్నవరం : దట్టమైన పొగమంచు కారణంగా  విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఉదయం విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  దీంతో పలు విమానాలు సుమారు 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. తెల్లవారుజాము నుంచి గన్నవరం విమానాశ్రయంలో రన్‌వేని పూర్తిగా పొగ మంచు కప్పేయడంతో ఉదయం 8.00 గంటలకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన ట్రూజెట్‌ విమానం ల్యాండింగ్‌కు ఇబ్బంది ఏర్పడింది. అలాగే హైదరాబాద్-విజయవాడ-బెంగళూరు స్పైస్ జెట్, హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్ స్పైస్ జెట్ విమానాలు ల్యాండింగ్‌కు అవకాశం లేకపోవడంతో తిరిగి వెనక్కు వెళ్లిపోయాయి. దీంతో  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్, బెంగుళూరుల నుండి కనెక్టివిటీ విమానాలలో వెళ్ళవలసిన ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.
 

మరిన్ని వార్తలు