అతి చిన్న ఆవుకు దూడ జననం

16 Feb, 2018 02:07 IST|Sakshi

కైకలూరు: ఏపీ రాష్ట్రంలో అతి చిన్న ఆవుకు 16.5 అంగుళాల దూడ జన్మించింది. గురువారం కృష్ణాజిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన పశుపోషకుడు అల్లూరి శ్యాంప్రసాద్‌ ఇంటి వద్ద ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం కేరళ నుంచి కాసర్‌గడ్‌ జాతికి చెందిన ఆవును రైతు శ్యాంప్రసాద్‌ కొనుగోలు చేశాడు. ఆ ఆవుకు రెండు దూడలు పుట్టి చనిపోయాయి. మూడో విడత పుట్టిన దూడ ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రముఖ వెటర్నరీ సర్జన్‌ ప్రతాప్‌ తెలిపారు.

గతేడాది గిన్నిస్‌బుక్‌ రికార్డు కోసం ఈ ఆవు ఎత్తును పంపామన్నారు. 29 అంగుళాలతో అతి చిన్న ఆవుగా రెండో స్థానంలో నిలిచిందన్నారు. కేరళకు చెందిన వేచూర్‌ ఆవు 28.5 అంగుళాలతో మొదటి స్థానం సాధించిందన్నారు. ప్రపంచంలో కాసర్‌గడ్‌ ఆవులు కేవలం 70 మాత్రమే ఉన్నాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు