యువకుడు ఆత్మహత్య

11 Mar, 2019 13:08 IST|Sakshi

సాక్షి, అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : ‘నాకు బతుకు మీద ఆశలేదు.. నేను చనిపోతాను..’ అంటూ తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు చెప్పినంత పని చేశాడు. నున్న రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాంతినగర్‌ ప్రాంతానికి చెందిన అమర్లపూడి సుశీలకుమారికి కూతురు, కొడుకు సంతానం ఉన్నారు. కొడుకు అవినాష్‌ (22) డిగ్రీ వరకూ చదువుకున్నాడు. కొంతకాలం నుంచి ఆయనకు మతి స్థిమితం సరిగా ఉండడం లేదు. దీంతో శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అవినాష్‌ తన అక్కకు ఫోన్‌ చేసి తనకు బతకాలని లేదని, తాను చనిపోతానంటూ ఫోన్‌ చేశాడు.

దీంతో భయభ్రాంతులకు గురైన అతని తల్లి, అక్క చుట్టుపక్కల ప్రాంతాలు, నగరంలో పలు చోట్ల వెతికి నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కృష్ణా నదిలో ఆదివారం ఓ యువకుడి శవం లభ్యమైనట్లుగా సమాచారం అందింది. విషయాన్ని అవినాష్‌ కుటుంబ సభ్యులకు తెలుపగా వారు వెళ్లి చూసి చనిపోయిన ఆ వ్యక్తి అవినాషేనని తేల్చారు.

పోలీసులు మిస్సింగ్‌ కేసును అనుమానాస్పద మృతిగా మార్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. తమ కుమారుడు మృత్యువాతపడ్డాడని తెలుసుకున్న ఆ తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.  
అవినాష్‌ (ఫైల్‌)

Read latest Krishna News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా