రాజస్థాన్‌ దొంగల అరెస్ట్‌

18 Jan, 2018 04:07 IST|Sakshi

నంద్యాలటౌన్‌: జిల్లాలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు దొంగలను నంద్యాల త్రీటౌన్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. నంద్యాల  త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ గోపాలకృష్ణ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన సరపత్‌లాల్‌సింగ్, జితేందర్‌సింగ్‌ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేసేవారు. రాజస్థాన్‌లో    చోరీ సొమ్మును విక్రయించి దాంతో జల్సాలు చేసేవారు.

 వీరిపై  నంద్యాలలో 8 కేసులు,కర్నూలు టూటౌన్‌ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. పట్టణంలోని రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్న ఎంప్లాయీస్‌ భవనాల ఎదుట అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో వారిని త్రీటౌన్‌ సీఐ దేవేందర్, ఎస్‌ఐ కృష్ణుడు  సిబ్బందితో చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 46 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. వీరి నుంచి ఇంకా 600 గ్రాముల బంగారు, 2 కేజీల వెండి రికవరీ కావల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు