ప్రేమ ఓ డ్రగ్‌ లాంటిది.. దానికోసం..

12 Oct, 2019 12:39 IST|Sakshi

ప్రేమ గురించి మనకు తెలిసింది కొంత మాత్రమే. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ప్రేమలో ఉన్నపుడు, ప్రేమించిన వారితో కలిసున్నపుడు మనలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పులు శారీరకంగా, మానసికంగా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రేమ వల్ల మనిషికి కలిగే లాభాలు, ఆసక్తికరమైన అంశాలు ఓ పది మీ కోసం.. 

1) ప్రేమలో పడటం అన్నది ఓ డ్రగ్‌లాగా పనిచేస్తుంది. కొకైన్‌, హెరాయిన్‌ తీసుకున్న వారు ఎలాంటి అనుభూతి పొందుతారో ప్రేమలో పడినప్పుడు కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది. ఈ రెండు కూడా డొపమైన్‌, ఆక్సిటోసిన్‌, ఎడ్రనలిన్‌ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. 
2) మీరు ఒత్తిడిలో ఉన్నపుడు ప్రేమించిన వారిని కొన్ని క్షణాలు కౌగిలించుకున్నట్లయితే మీకు త్వరలోనే ఉపశమనం కలుగుతుంది. ప్రేమించిన వారిని కౌగిలించుకున్నపుడు ఒత్తిడిని నివారించే ఆక్సిటోసిన్‌ అనే హార్మన్‌ విడుదలవుతుంది.
3) ప్రేమలో ఉన్నపుడు జీవితం శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటుంది. జంటలలో కంటే ఒంటరిగా ఉన్న వారిలోనే గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయని ‘మెటా అనాలిసిస్‌’ అనే పరిశోధనలో తేలింది. 
4) మనషులే కాదు కొన్ని జంతువులు కూడా మోనోగమస్‌ బంధాలను పాటిస్తాయని తేలింది. బీవర్స్‌, ఓటర్స్‌, తోడేళ్లు, సీహార్స్‌లు ఒకసారి ప్రేమించిన వాటితోటే జీవితాంతం కలిసి ఉంటాయి. 
5) దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న వారికి ప్రేమ ఓ మందులా పనిచేస్తుంది. మనం వేసుకునే పెయిన్‌ కిల్లర్‌లా ప్రేమ పనిచేసి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  
6) ఆడవారికంటే మగవారే తొందరగా ప్రేమలో పడతారు. మొదట ఐ లవ్‌ యూ చెప్పేది కూడా మగవారే.
7) ప్రేమించిన వారు మీ పక్కన ఉంటే రోగాల నుంచి, గాయాలనుంచి మామూలు కంటే రెండు రెట్లు తొందరగా కోలుకుంటారు. 
8) ప్రేమకోసం ఏ పనైనా చేయాలనే స్థితికి దిగజారటం కూడా జరుగుతుంది. దొంగతనాలు, హత్యలు ఇలా చాలానే.. 
9)  ప్రేమ మీ మెదడులోని పలు భాగాలను ఉత్తేజపరుస్తుంది. తద్వారా ఎదుటి వ్యక్తితో చక్కటి అనుబంధం ఏర్పడుతుంది.
10) ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం, భాగస్వామితో కలిసి జీవించటం వల్ల ఎక్కువ కాలం బ్రతుకుతారని వెల్లడైంది. పెళ్లైన వాళ్లు ఒంటరి వాళ్లకంటే దాదాపు 8 సంవత్సరాలు ఎక్కువకాలం జీవిస్తారని అంచనా.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు