మీ బాయ్‌ఫ్రెండ్‌ ఎలాంటి వాడు?

2 Dec, 2019 11:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఈ సృష్టిలో ఏ ఇద్దరి మనస్తత్వాలు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండవు. ఇలాంటి సమయంలో ఓ అమ్మాయి.. అబ్బాయి ప్రేమలో పడి అతడి ప్రవర్తన నచ్చక బంధానికి బ్రేకప్‌ చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మంచి లక్షణాలు కలిగిన కొందరు మగవారు గొప్ప భాగస్వాములవుతుంటే.. అర్థం కాని మనస్తత్వంతో మరి కొందరు అంతు చిక్కని వ్యక్తులుగా మిగిలిపోతున్నారు. ఆడవారు.. మగవారి స్వభావాలను అర్థం చేసుకోవటంలోనే వారితో చక్కనైన అనుబంధాన్ని కొనసాగించటం ఆధారపడి ఉంటుంది.  అమ్మాయిల జీవితాలలోకి ప్రవేశించే అబ్బాయి పలు రకాలు. వాటిలో ఈ క్రింది ఐదు రకాల మగవారిని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ ఐదు రకాలలో మీ బాయ్‌ఫ్రెండ్‌ ఎలాంటి వాడో ఓ లుక్కేయండి!

1) జలస్‌ బాయ్‌ఫ్రెండ్‌ 
ఇలాంటి మగవారు ప్రేమ అనే కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోరు. తమ పార్ట్‌నర్‌ ఎందుకు మగ స్నేహితులతో మాట్లాడుతుందో.. ఎందుకు మగవారితో స్నేహం చేస్తుందో అర్థం చేసుకోరు. పరాయి మగవాడితో పార్ట్‌నర్‌ మాట్లాడితే అస్సలు సహించలేరు. 

2) ఇన్‌సెక్యూర్‌ బాయ్‌ఫ్రెండ్‌
ఇలాంటి మగవారికి జలస్‌ బాయ్‌ఫ్రెండ్స్‌తో స్వభావంలో సామీప్యత ఉంది. ఎదుటి వ్యక్తినుంచి సరైన స్పందన లేకుంటే వీరు అల్లాడిపోతారు. భాగస్వామి తమను నిర్లక్ష్యం చేస్తోందేమోనన్న బాధతో సతమతమవుతారు. సరైన సమయానికి మెసేజ్‌లు, ఫోన్‌లలో అందుబాటులోకి రాకపోతే ఎదుటి వ్యక్తి తమను పట్టించుకోవటం లేదన్న భావనతో తమను తాము తక్కువ చేసుకుంటుంటారు. వీరు ఎల్లప్పుడు అసూయ, లో సెల్ఫ్‌ ఎస్టీమ్‌తో బాధపడుతుంటారు.

3) సెంటిమెంటల్‌ బాయ్‌ఫ్రెండ్‌
వీళ్లు మనం చదివిన రొమాంటిక్‌ నవలల్లోని వ్యక్తుల్లాంటి వారు. వీరితో గడిపే ప్రతి క్షణం అద్భుతంగా ఉంటుంది. ప్రేమగా చేతులు పట్టుకోవటం, మన కోసం బుకేతో ఇంటి బయట నిల్చోవటం, కష్టనష్టాల్లో తోడుగా ఉండటం వంటి వాటిలో ముందుంటారు. వీరితో ఎలాంటి అరమరికలు లేకుండా మాట్లాడటానికి ఉత్సాహం చూపుతాం. వీళ్లు రొమాన్స్‌లో కింగ్‌లు.

4) ప్రాక్టికల్‌ బాయ్‌ఫ్రెండ్‌
వీరు ఎమోషన్స్‌ కంటే కాల్‌క్యులేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. లాజికల్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీలైనంత ఎక్కువగా ప్రశాంతంగా ఉంటూ కొన్ని సందర్భాల్లో మాత్రమే తమ కోపాన్ని ప్రదర్శిస్తారు. ప్రాణంగా ప్రేమించటం అన్నది వీరి డిక్షనరీలో లేని పదం. 

5) చిల్లుడ్‌ అవుట్‌ బాయ్‌ఫ్రెండ్‌ 
వీరు అందరికంటే భిన్నమైనవారు. ఒకరకంగా చెప్పాలంటే అమ్మాయిలకు బెస్ట్‌ఫ్రెండ్‌ లాంటి వాళ్లు. భాగస్వామిని సంతోషపెట్టాడానికి ఏం చేయాలో వీరికి బాగా తెలుసు. భాగస్వామి మనసును నొప్పించకుండా వారి అభిరుచులకు తగినట్లుగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు. ఇలాంటి వారితో ప్రేమను పంచుకోవటానికి అమ్మాయిలు ఎక్కువ ఆసక్తి చూపుతారు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు