నిన్ను మర్చిపోవడం అంటే చచ్చిపోవడమే!

5 Feb, 2020 13:07 IST|Sakshi

హాయ్‌ నా పేరు కృష్ణ. నేను బీఎస్‌సీ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశాను. తన పేరు శృతి. తను టైలరింగ్‌ నేర్చుకోవడానికి వచ్చేది. అప్పుడే తను నాకు పరిచయం అయ్యింది.  కొద్ది రోజుల తరవాత అది ప్రేమగా మారింది. నేను ఒక రోజు శృతికి ఆ విషయం చెప్పాను. తను కూడా నా ప్రేమను ఒప్పుకుంది. మా ప్రేమ విషయంలో మాకు చాలా గొడవలు అయ్యాయి. అయిన మేం ఒకరిని వదిలి ఒకరం ఉండలేకపోయేవాళ్లం. ఎన్ని గొడవలు అయిన ఒక్క రోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేకపోయేవాడిని. శృతి అంతలా నా మీద ప్రేమ చూపించేది. ఒక రోజు తను వాళ్ల ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పింది. నేను మనం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాను. తను సరే అంది. మా ఇద్దరి కులాలు వేరు. అందుకే నేను ఒక సంవత్సరం పాటు ఎదురు చూశాను. 

తను ఒకరోజు ఫోన్‌ చేసి నాకు ఇంట్లో మ్యారేజ్‌ ఫిక్స్‌ చేశారు. నాకు ఇంకా ఫోన్‌ చేయకు అని చెప్పింది. అప్పుడు నాకు జీవితంలో ఎప్పుడూ లేనంత బాధ వేసింది. శృతికి ఆ పెళ్లి ఇష్టం లేకపోయిన వాళ్ల ఇంట్లో వాళ్ల కోసం ఆ పెళ్లికి ఒప్పుకుందని తరువాత నాకు తెలిసింది. అప్పుడు నేను వచ్చేసేయ్‌ మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాను. తను రాలేదు. ఇప్పుడు కూడ తన కోసమే నా ఆలోచన. నా స్థానంలో వేరే వాళ్లను ఊహించుకోలేకపోతున్నాను. నా ఊపిరి ఉన్నంత కాలం నేను తనని మర్చిపోలేను. నువ్వు జాగ్రత్త శృతి నువ్వు లేని జీవితం శూన్యం శృతి. నువ్వే నా ప్రపంచం. నువ్వు గుర్తురాని క్షణం లేదు. ఐ లవ్‌ యూ శృతి. ఐ మిస్‌ యూ. నేను నిన్ను మర్చిపోవడం అంటే చచ్చిపోవడమే. 

కృష్ణ(అమలాపురం).

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు