ఒకేసారి ఇద్దరితో ప్రేమ.. సాధ్యమేనా?

11 Oct, 2019 14:08 IST|Sakshi

పుట్టిన వాడికి మరణము తప్పదు అన్నట్లుగా ప్రేమ కూడా తప్పదు. ప్రతి మనిషి తమ జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడటం జరుగుతుంటుంది. ప్రస్తుత సమాజంలో ప్రేమను ఎవ్వరూ తప్పుపట్టకపోయినప్పటికి.. ఏక కాలంలో ఇద్దరు వ్యక్తులను ప్రేమించటాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తారు. ‘‘నేను ఇద్దరు వ్యక్తులను ప్రాణంగా ప్రేమిస్తున్నాను’’ అని చెబితే వింతగా చూస్తారు. ఏక కాలంలో ఇద్దరు వ్యక్తులతో ప్రేమ(శృంగారానికి సంబంధించినది కాదు)లో పడటం అన్నది సర్వసాధారణం కాకపోయినా.. సాధ్యమే.

ఒకేసారి ఇద్దరు వ్యక్తులతో ఒకే రకమైన భావోద్వేగాలతో కూడిన అనుబంధం కలిగి ఉండటం అన్నది జరుగుతుంది. ఈ విషయాన్ని సైకాలజిస్టులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఇద్దరితోనే కాదు అంతకు మించి ఎక్కువమందిపై కూడా ప్రేమ పుట్టొచ్చని అంటున్నారు. అమ్మా,నాన్నలతో, స్నేహితులతో ఇలా ఎక్కువమందితో ఏ విధంగా బంధాన్ని కలిగి ఉంటామో అలా. ఇద్దరు వేరువేరు వ్యక్తుల్లోని వేరువేరు గుణాలతో ప్రభావితమై వారితో ఒకేరకమైన భావోద్వేగపూరిత బంధం ఏర్పడవచ్చు.​

ఒకరితో ప్రేమలో ఉన్నంత మాత్రన మరొకరిని ప్రేమించకూడదన్న రూలేమీ లేదు. దీనిని మానసిక వ్యభిచారంగా తప్పుబట్టడానికి లేదు. నిజమైన ప్రేమలో మోనోగమి ఉండాలన్న రూలేమీ లేదు. ఈ మనిషి పెట్టుకున్న కట్టుబాట్లకు మనసు!! లొంగదని గుర్తించాలి.  అయితే ఇలాంటి ప్రేమ చాలా కష్టతరమైనది. దీని వల్ల జీవితంలో తేరుకోలేని దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఒకవేళ ఇలాంటి ప్రేమలో ఉన్నట్లయితే వెంటనే నిపుణుల సలహా తీసుకోవటం ఉత్తమం. ఈ ప్రేమ వల్ల కలిగే నష్టాలను బేరీజు వేసుకుని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగటం మంచిది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు