ఇలా ఉంటే మీరే రాజు.. మీరే మంత్రి

13 Oct, 2019 16:40 IST|Sakshi

సోలోగా ఉండటమంటే.. పెళ్లి,పెటాకులు, ఎవరితోనూ ప్రేమలో లేకుండా ఒంటరిగా ఉండటమనే కాదు! మనతో మనం ఉండటం. మనల్ని మనం ప్రేమించుకోవటం. కొంతమంది ఓ సినిమాలో హీరోలాగా గ్యాప్‌ లేకుండా ఒకరితర్వాత ఒకర్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఎదుటి వారి వల్ల కష్టపడో లేక వారిని కష్టపెట్టో విడిపోతుంటారు! తరుచూ బాధపడుతుంటారు. అయితే సోలో లైఫ్‌లో ఇలాంటివేవీ ఉండవని చెప్పొచ్చు. ఇందులో ఇతరుల ప్రవర్తన వల్ల మన మనసును బాధించుకునే సందర్భాలు చాలా అరుదు. ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితానికి మీరే రాజు.. మీరే మంత్రి. సోలోగా ఉండటం వల్ల చాలానే లాభాలు ఉన్నాయి.

1) స్నేహ బంధాలు ధృడపడతాయి
సోలోగా ఉండటం వల్ల స్నేహితులకోసం ఎక్కువ సమయం కేటాయించటానికి అవకాశం ఉంటుంది. నిరంతం భాగస్వామికోసం, పిల్లల కోసం తపనపడాలన్న ఆలోచనలేకుండా మిత్రులతో సరదాగా గడపొచ్చు.

2) ఆరోగ్యంపై శ్రద్ధ
సోలో లైఫ్‌లో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవటానికి ఎక్కువ సమయం దొరకుతుంది. పెళ్లైన వారికంటే సింగిల్‌గా ఉన్న వారే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైంది. పెళ్లైన వారికంటే ఒంటరి వ్యక్తులు వారంలో ఎక్కువ సార్లు వ్యాయామం చేస్తారని తేలింది.

3) మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవచ్చు
సోలోగా ఉండటం వల్ల కలిగే అతి ముఖ్యమైన లాభం మనల్ని మనం అర్థం చేసుకోవటం. మన ఇష్టాయిష్టాలను, అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. పక్కవారి కోసం మనల్ని మనం మార్చుకునే అవసరం ఎంతమాత్రమూ లేదు.

4) అనవసర ఖర్చులు
సింగిల్‌గా ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులను నివారించవచ్చు. మనం కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరుల కోసం ఇష్టం లేకపోయినా ఖర్చు చేయటం ఉండదు. మన ఇష్టప్రకారం,మనకోసమే వాటిని ఖర్చు చేసుకోవచ్చు.

5) అంతా మీ ఇష్టం :
సోలో లైఫ్‌లో మనకు నచ్చినట్లుగా మనం ఉండొచ్చు. సినిమాలకు వెళ్లాలన్నా, షికార్లకు వెళ్లాలన్నా పదిసార్లు ఆలోచించాల్సి అవసరం లేదు.

6) కుటుంబం కోసం..
కనిపెంచిన అమ్మానాన్నలు, తోడబుట్టిన వాళ్ల కోసం ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. పెళ్లైనా లేదా ప్రేమలో ఉన్నా మన ప్రాధాన్యతలు మారుతుంటాయి! దీంతో మిగిలిన కుటుంబసభ్యులను నిర్లక్ష్యం చేస్తుంటారు. సింగల్‌గా ఉండటం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు