పెళ్లి చేసుకోకపోతే బ్లాక్‌ మెయిల్‌ చేస్తావా?..

18 Dec, 2019 08:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

2012 చివరి నెల అది. డిప్లమా ట్రైనింగ్‌లో జాయిన్‌ అయ్యాం. అదేరోజు అతడిని చూశాను. రోజూ బాగానే మాట్లాడేవాడు. సడెన్‌గా ఓ నెల తర్వాత లవ్‌ అన్నాడు. ఒప్పుకోకపోతే తట్టుకోలేను అన్నాడు. కుదరదు అని చెప్పడానికి కారణం లేక సరే అన్నాను. చాలా ప్రేమ చూపించేవాడు. నేను చాలా అదృష్టవంతురాలినని అనుకునే దానిని. చిన్నచిన్న అలకలు బుజ్జగింపులతో జీవితం హ్యాపీగా సాగిపోయేది. నా లైఫ్‌లో తను ఉంటే చాలు అనిపించేది. సడెన్‌గా ఏమైందో ఏమో తెలియదు, 2019 మేలో కాల్‌ చేసి ‘ నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తావా? మా ఇంటికి వచ్చి గొడవ చేస్తావా?’ అని అడిగాడు. చాలా బాధగా అనిపించింది. ‘ఇన్ని రోజుల పరిచయంలో నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా’ అనిపించింది.

తర్వాత మాట్లాడటం తగ్గించేశాడు. తనకి వాళ్ల చుట్టాల అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ అయిన సంగతి కూడా నాకు తెలియదు. చచ్చిపోవాలనిపించింది. ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు. 2019 నవంబర్‌ 21న తనకు మ్యారేజ్‌ అయిందని నాకు తెలిసింది. ఇంకా మర్చిపోవటానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు నాకు అన్నీ నా ఫ్యామిలీనే.. ఫ్యామిలీ బాధ్యతలను తీసుకున్నా. వాళ్లతో హ్యాపీగా ఉంటున్నా ఎక్కడో తెలియని బాధ. చివరిగా తనకో మాట చెప్పాలని ఉంది. ‘నువ్వు ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా హ్యాపీగా ఉండు బుజ్జి. నువ్వు ఎందుకిలా చేశావో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు.’
- భవాని, తెనాలి
చదవండి : ఎక్కడ ఉన్నా ఫోన్‌ చేయ్‌! లేకపోతే..
అతడో రౌడీ.. ఆమె ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు