నాన్న మాట కాదనను.. నిన్ను వదులుకోను

21 Dec, 2019 08:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాది కరీంనగర్ జిల్లా. మా అక్క కూతరు ఫ్రెండ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ప్రతి రోజూ చిట్ చాట్ చేసుకునేవాళ్లం. అలా కొద్దిరోజులకే మా పరిచయం ప్రేమగా మారింది. ఒకరోజు మా ఫ్రెండ్ ‘ఇలా రోజూ చాట్ చేసుకోవడం బదులు. నువ్వు ఆమెను ప్రేమిస్తున్న సంగతి ధైర్యంగా చెప్పొచ్చుగా’  అని అన్నాడు. దానికి నేను ‘ ఆమెకు ప్రపోజ్‌ చేసి ఉన్న ఫ్రెండ్షిప్ లాస్ చేసుకోవడం ఎందుకు’ అని అన్నాను. దానికి నా ఫ్రెండ్ ‘నువ్వు చెప్పినా చెప్పకున్నా తను ఎలాగూ దూరం అవుతుంది కదా!’ అని అన్నారు. బాగా ఆలోచించి ఓ రోజు అర్థరాత్రి తనకు నా మనసులోని ప్రేమను సందేశం ద్వారా చెప్పాను.

రెండు రోజుల వరకు ఎలాంటి రిప్లై లేదు. నేను కూడా రెండు రోజుల వరకు మళ్లీ మెసేజ్ చేయలేదు. మూడు రోజుల తర్వాత మెసేజ్ వచ్చింది. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. అలా మూడు సంవత్సరాలు చాటింగ్ చేస్తూ గడిపాం. వాళ్ల చెళ్లి సహాయంతో.. మా బంధువుల ద్వారా పెళ్లి చూపులు అయిపోయాయి! అన్నీ ఓకే అనుకున్నాము. తర్వాత మాగురించి ఎవరో ఏమో చెప్పారని వాళ్ల నాన్న ఈ పెళ్లి వద్దు అన్నారు. ఆయనను ఒప్పించటానికి మేమిద్దరం చాలా  ప్రయత్నించాం. కానీ, మా ప్రయత్నాలు సఫలం కాలేదు.

తను ‘మా నాన్న మాట నేను కాదనలేను! అలాగని నిన్ను వదులుకోను’ అని అంది. పరిస్థితుల కారణంగా ఆమె  పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎలాంటి విషయం తన గురించి తెలియదు. కానీ, తను బాగుందని తెలిసింది. తన పెళ్లి అయిన తర్వాత నేను కూడా చేసుకున్నాను. ఇద్దరం ఎవరికి వారు చాలా సంతోషంగా ఉన్నాం. ఒక్క సారైనా తనను చూడాలని కోరిక. మా ప్రేమ కథలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే! తను నేను మూడు సంవత్సరాల పాటు చాట్ చేసుకున్నామే తప్ప ఏ రోజూ ఫోన్‌లో మాట్లాడుకోలేదు.
- సంపత్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు