అది తెలిసి మానసికంగా చనిపోయా!

9 Dec, 2019 10:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అమ్మాయిలతో డైరెక్ట్‌గా మాట్లాడే ధైర్యం లేక ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకోవాలనే చిన్న ఆశతో ఎఫ్‌బీకి దగ్గరయ్యాను. అలా ప్రేయసి కోసం చూస్తున్న సమయంలో ఓ అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా నా వైపునుంచి ప్రేమగా మారింది. ఎంతగా అంటే తను మెసేజ్‌ చేయకపోతే ఉండలేనంతగా. అలా ఆ అమ్మాయికి ఒక రోజు నా ప్రేమ విషయం చెప్పాను. నా మీద ప్రేమ ఉన్నా కూడా వాళ్ల ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని కుదరదని చెప్పింది. కానీ, కొన్ని రోజులకు ఓకే చెప్పింది. వాళ్ల పేరెంట్స్‌ను ఒప్పిస్తాననే నమ్మకం ఉండేది. ఇలా ఒక సంవత్సరం గడిచింది. నాతో పెళ్లి అవ్వదేమోనన్న భయం, వాళ్ల నాన్న ఇంట్లో పెట్టే టార్చర్‌ నానుంచి తనను దూరం చేస్తూ వచ్చాయి.

అప్పుడు నా బీటెక్‌ ఎక్షామ్స్‌. తను నన్ను అవాయిడ్‌ చేయటం స్టార్ట్‌ చేసింది. పిచ్చిపట్టినట్లు ఉండేది. తన ఆలోచనలతో సెమ్‌ ఎక్షామ్స్‌ మొత్తం ఫేయిల్‌ అయ్యాను. అలా ఆ గొడవలతో ఫైనల్‌ ఇయర్‌ గడిచింది. ఏడు సబ్జెక్టులు మిగిలినపుడు కూడా నేను పెద్దగా బాధపడలేదు. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి మానసికంగా చనిపోయా. తాగుడుకు బానిసయ్యా. తనను ఎలాగైనా పొందాలనే ఆశమాత్రం చావలేదు. ఎన్నో విధాలుగా ప్రయత్నించాను. కానీ, తను నన్ను దూరం పెట్టింది. ఆ సమయంలో మా నాన్న దగ్గరినుంచి ఫోన్‌ వచ్చింది. వాళ్లను మోసం చేస్తున్నానని చాలా బాధపడ్డాను.

ఎలాగైనా బీటెక్‌ పాసవ్వాలని నిశ్చయించుకున్నాను. సిటీలో బ్రతకాలంటే చిన్న జాబ్‌ అయినా ఉండాలి. నా క్వాలిఫికేషన్‌కు తగ్గ జాబ్‌ కోసం తిరిగినా లాభం లేకపోయింది. ఒక్కపూట తిని పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. చివరిగా ఒక మార్కెటింగ్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా జాయిన్‌ అయ్యాను. జాబ్‌ చేస్తూనే చదివి బీటెక్‌ సబ్జెక్టులు పాసయ్యా. ఆ తర్వాత కాగ్నిజెంట్‌లో జాబ్‌ సంపాదించా. ఆ అమ్మాయి నన్ను వదిలేసిన బాధ నా లైఫ్‌లో తీరదు. అలాగని నా పేరెంట్స్‌ను బాధపెట్టలేను. ఇప్పుడు నేను బ్రతికున్నానంటే మా పేరెంట్స్‌ కోసమే. లవ్‌ యూ బంగారం. మిస్‌ యూ రా!...
- భార్గవ్‌, హైదరాబాద్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు