అతన్ని చూస్తే శత్రువుని చూసిన ఫీలింగ్‌!

12 Dec, 2019 16:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నా పాఠశాల చివరి రోజులవి.. పాఠశాలతో బంధం తెగిపోతుందనుకున్నా. కానీ, నా జీవితంలో కొత్త బంధం మొదలైంది. మంచి నీళ్ల బావి దగ్గర అతడితో పరిచయం ఏర్పడింది. అతడికి నేనంటే చాలా ఇష్టం! నాకోసం బావి దగ్గర ఎప్పుడూ ఎదురు చూసేవాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్లం. అలా సెలవులు పూర్తయి కాలేజీ రోజులు మొదలయ్యాయి. నేను తను వేరువేరు కాలేజీలు. హాస్టల్‌లో ఉండేదాన్ని. నేను కాలేజీలో ఉన్నప్పటికి నా మనసంతా అతని దగ్గరే ఉండేది. ఎప్పుడు సెలవులు వస్తాయా! అతన్ని ఎప్పుడు కలవాలా అని వెయ్యికళ్లతో ఎదురు చూసేదాన్ని. తను కూడా నాలాగే ఎదురు చూసేవాడు. మా కాలేజీ వాళ్లను ‘మీకు సెలవులు ఎప్పుడు ఇస్తారు’ అంటూ అడిగేవాడు.

ఇలా ఒకరి గురించి ఒకరం ఆలోచించుకుంటూ రోజులు గడిపేస్తున్నాం. తను తన ప్రేమ సంగతి చెప్పి 10 నెలలు గడుస్తోంది. తను చెప్పిన రోజే నా ప్రేమ విషయం అతనికి చెప్పాలని ఎంతో ఆనందంగా సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లాను. నా కళ్లు అతడికోసం వెతకసాగాయి! అతను కనిపించలేదు. నా స్నేహితురాలు కనిపిస్తే అతని గురించి అడిగాను. అతను నన్ను లవ్‌ చేస‍్తలేడు. నా బెస్ట్‌ఫ్రెండ్‌ని లవ్‌ చేస్తున్నాడని చెప్పింది. నా గుండె మీద బండరాయి వేసినంత పనైంది.

ఆ బాధ భరించలేకచాలా ఏడ్చాను. ఇక నా జీవితంలో ప్రేమ అనేది ఉండకూడదని నిర్ణయించుకున్నా. అతన్ని చూస్తే శత్రువుని చూసిన ఫీలింగ్‌ కలిగేది. ఎంతంటే మేము కలిసే బోరు బావిని కూడా చూడటానికి ఇష్టపడకపోయేంతలా. అలా కొన్ని రోజులు గడిపిన తర్వాత నాకు తెలిసిన నిజం! అతను తన మీద నాకున్న ప్రేమను నా నోటినుంచి చెప్పించడానికి అలా అబద్ధం చెప్పించాడని. అతను చెప్పిన చిన్న అబద్ధం నా ప్రేమ ముగింపుకు కారణం..??
- గీత


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

>
మరిన్ని వార్తలు