నేను పిచ్చివాడిలా ఆమెకోసం..

12 Dec, 2019 10:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను ఇంటర్‌ చదివేటప్పుడు ఒక అమ్మాయి నన్ను ఫిజిక్స్‌లో డౌట్‌ అడిగింది. నేను ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేశాను. అప్పుడు ప్రేమ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. మా మధ్య స్నేహం మొదలైంది. సినిమాలకు కూడా వెళ్లే వాళ్లం. ఆ సమయంలోనే ఆమెపై నాకు ప్రేమ మొదలైంది. ఓ సారి థియేటర్‌లో ఉండగా లవ్‌ చేస్తున్నానని ఆమెకు చెప్పాను. అప్పుడే తెలిసింది! తను కూడా నన్ను లవ్‌ చేస్తోందని. తను అప్పటివరకు చెప్పలేదు. ప్రేమలో రోజులు వేగంగా గడిచిపోసాగాయి. చూస్తుండగానే ఇంటర్‌ పూర్తయింది. తను వేసవి సెలవులకు వాళ్ల ఊరికి వెళ్లిపోయింది. ఆ టైంలో ఫోన్లు కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లం. డిగ్రీకి ఇద్దరం వేరు వేరు కాలేజీల్లో చేరాం.

తర్వాత ఇద్దరి మధ్యా సంబంధాలు తెగిపోయాయి. నేను పిచ్చివాడిలా ఆమెకోసం వేయిట్‌ చేశాను. నా లైఫ్‌ మొత్తం తనే అని ఎన్నో కలలు కన్నా. వాళ్ల గ్రామానికి కూడా వెళ్లాను. అప్పుడర్థం అయ్యింది తను మ్యారేజ్‌ చేసుకుని వెళ్లిపోయిందని. ప్రేమిస్తే మూవీ హీరోలో నన్ను నేను చూసుకున్నా. తను ఎలా ఉందో తెలుసుకుందామని వెళ్లాను. తను నన్నే కాదు లోకాన్నే విడిచిపోయిందని తెలిసింది. వాళ్ల ఇంట్లో వాళ్లకు పెళ్లి ఇష్టం లేదని చెప్పిందంటా. వాళ్లు బలవంతంగా పెళ్లి చేశారంట. తను నాకు చెప్పలేదు. తన ఇంటికి వెళ్లి అడిగాను. అక్కడ వాళ్ల నాన్నను చూసిన తర్వాత నా ప్రేమ కంటే ఆయన ప్రేమ ఎంతో ఎక్కువని అర్థం అయింది.

నేను ఎలా ఉన్నానో వాళ్ల నాన్న కూడా అలాగే ఉన్నారు. ఆమెను తలుచుకుంటూనే బ్రతికాను. నాకు కూడా చచ్చిపోవాలనిపించేది. కానీ, తన జ్ఞాపకాలు నాతో ఉన్నాయి. అవి చాలు ఈ జీవితం మొత్తం గడపటానికి. అప్పుడు మా ఇంట్లో వాళ్లు నాకో సంబంధం చూశారు. నాకోసం కాకపోయినా నా ఫ్యామిలీ కోసం పెళ్లి చేసుకున్నా. పెళ్లికి ముందే నా ప్రేమ గురించి నా భార్యకు వాళ్ల ఇంట్లో వాళ్లకు చెప్పాను. ఫస్ట్‌ లవ్‌లో ఉన్న ఫీలింగ్‌ ఎప్పుడూ రాదు! ఒకసారి వస్తే అది చచ్చేదాక గుర్తుండిపోతుంది. 
- వెంకటేశం‌, హైదరాబాద్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు