ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు! బస్‌లో...

19 Feb, 2020 10:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

2008లో నేను బీటెక్‌లో జాయిన్‌ అయ్యాను! అప్పుడే మొదటిసారి ఈడీసీ ల్యాబ్‌లో ఆద్యను చూశాను. ఆమె అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అది చూసి నాకు కూడా తనతో ఫ్రెండ్షిప్‌ చేయాలనిపించేది. నేను చాలా షైగా ఉండేవాడిని. సో తనతో మాట్లాడటానికి, ఫ్రెండ్షిప్‌ చెయ్యడానికి చాలా రోజులు పట్టింది. సెకండ్‌ ఇయర్‌కి వచ్చేసరికి కొంచెం క్లోజ్‌ అయ్యాం. కానీ, తన మీద లవ్ ఉందని నాకు తెలియలేదు. వేరే ఎవరైనా నా కన్నా తనతో క్లోజ్‌గా ఉంటే బాగా కుళ్లు వచ్చేది. సెకండ్‌ ఇయర్ సెకండ్‌ సెమ్‌లో ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ ఒకడు తనకి లవ్ ప్రపోజ్‌ చేశాడు. తను కూడా ఒప్పుకుంది. ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. వాళ్లిద్దరూ నా ఫ్రెండ్స్ కాబట్టి. కానీ ఉండేకొద్దీ వాళ్లిద్దరూ బాగా క్లోజ్‌గా ఉండటం, అన్నీ షేర్ చేసుకోవడం అన్నీ చూసి నేను తట్టుకోలేకపోయాను. అప్పుడే అర్ధం అయ్యింది! నేను తనని లవ్‌ చేస్తున్నా అని. ఎందుకో తెలీదు వాళ్ళ లవ్‌ ఒక నెలలోనే బ్రేకప్‌ అయింది. ఆ తర్వాత తన ఫ్యామిలీలో కొన్ని విషాద సంఘటనలు జరిగాయి. వాటి వల్ల తను మెంటల్‌గా ఇబ్బందికి గురయ్యింది.

తనకి నేను చాలా ధైర్యం ఇవ్వాలనుకున్నా. కానీ, కాలేజ్‌కి కూడా సరిగా వచ్చేది కాదు. నా ఫ్రెండ్ లాగా నేను మాటకారిని కూడా కాదు. థర్డ్‌ ఇయర్‌ చివర్లో తను కోలుకుంది. వాళ్ల ఫ్యామిలీ కూడా మా ఇంటి వెనక లైన్లోకి షిప్టు అయ్యారు. థర్డ్‌ ఇయర్‌ తర్వాత సమ్మర్ హాలిడేస్‌లో తను కొన్ని కోర్సెస్‌లో జాయిన్‌ అయ్యింది. అది తెలిసి నేను కూడా తను ఉన్నచోటే జాయిన్ అయ్యాను. ఆ రోజులు నా జీవితంలో గోల్డెన్ డేస్. తనతో చాలా సేపు కలసి ఉండేవాడిని. ఇంటికి కలిసి వెళ్లేవాళ్లం. చాలా ఫాస్ట్‌గా రెండు నెలలు గడిచిపోయాయి. అప్పుడే తనకి నా లవ్‌ గురించి చెప్పాను. మెసేజ్‌లో, డైరెక్ట్‌గా చెప్పే అంత ధైర్యం నాకు లేదు.

అది చెప్పిన తర్వాత ఒక రెండు రోజులు నేను తనని డైరెక్ట్‌గా చూడలేకపోయా. తను నార్మల్‌గానే ఉంది. కానీ, నాకు మాత్రం ఏదో తెలియని ఫీలింగ్. నన్ను తను ఎప్పుడు ఒక పిల్లోడి లాగా, అమాయకుడిలాగా, ఫ్రెండ్‌ లాగానే చూసింది. కానీ నేనంటే చాలా కేరింగ్‌గా ఉండేది. చాలా వాల్యూ అండ్‌ ఇంఫార్టెన్స్‌ ఇచ్చేది. అందుకే తను అంటే నాకు చాలా అభిమానం. అవునని లేదా కాదని ఏమీ చెప్పలేదు. మేము అలానే కంటిన్యూ అయ్యాము. నేను తనని లవ్ చేస్తున్నా అని, నన్ను బాగా టీజ్‌ చేసేది.  తను అలా చేస్తుంటే  నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని. తను నాతో చాలా సీక్రెట్స్ షేర్‌ చేసుకునేది. అలా మా క్లాస్‌కి సంబంధించి ఎదో ఒకటి షేర్ చేసుకునేది. దాన్ని నేను నా క్లోజ్‌ ఫ్రెండ్‌ ఒకడికి ఒకసారి మాటల్లో చెప్పాను. వాడు దాన్ని ఒక గొడవ నుండి బయట పడటానికి వాడుకున్నాడు.

దాని వల్ల తను నాతో చాలా రోజులు మాట్లాడలేదు. లాస్ట్‌ డేస్‌లో మళ్లీ మాట్లాడింది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసేది. దాన్ని అలానే కంటిన్యూ చేసి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ, కాలేజ్‌ అయిపోయిన ఒక రెండు నెలల తర్వాత ఎదో విషయం మళ్లీ ఎవరికో చెప్పానని మాట్లాడటం ఆపేసింది. చాలా బాధ పడ్డాను. తర్వాత మాట్లాదిద్ది అనుకున్నా. కానీ, 8 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎన్నో సార్లు మెసేజ్‌ చేసినా నో రిప్లై. నేను ఫారెన్‌ వెళ్లి సెటిల్‌ అయ్యాను. అయినా తన పుట్టినరోజు అప్పుడు న్యూ ఇయర్‌కి మెసేజెస్‌ చేస్తూనే ఉన్నాను. కానీ నో రెస్పాన్స్‌. తన రిప్లై కోసం ఎంత తపించానో నాకు తెలుసు. తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసి నేను కూడా పెళ్లి చేసుకున్నా. కానీ, తనను నేను ఇంకా మిస్ అవుతున్నాను, ఒక మంచి ఫ్రెండ్‌లాగా తనతో మళ్లీ మాట్లాడాలని ఉంది కానీ ఏమీ చెయ్యలేకపోతున్నా.

తనంటే నాకు చాలా ఇష్టం. తన క్యారెక్టర్‌ అంటే ఇష్టం! నా పట్ల తను చూపించే ప్రేమ, కేరింగ్‌ అంటే ఇష్టం. తనని ఎంత ఇష్టపడ్డా, ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు నేను, బస్‌లో కూడా అవకాశం వచ్చినా పక్కన కూర్చునే వాడిని కాదు. అందరూ తనని ఏం అనుకుంటారో అని. తనని చూడటం, తనతో మాట్లాడటం...ఇవే నాకు చాలా మ్యాజికల్‌ ఫీలింగ్స్ ఇచ్చేవి. తనని మిస్‌ అవ్వడమే నా జీవితంలో నేను ఎప్పటికి తిరిగి పొందలేనిది, ఎప్పటికి బాధ పడే విషయం. ఆమె ముందు అన్నీ చిన్నవే అనిపిస్తుంది, ఆద్య నన్ను ఒక్కసారి అయినా లవ్‌ చేసిందో లేదో తెలీదు. కానీ, నేను ఇంకా బెటర్‌గా హ్యాండిల్‌ చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఏం అనుకున్నా తను, ఆ రోజులు మళ్లీ తిరిగి రావు. 
- చంద్రకాంత్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు