తనతో గొడవ.. ఫైనల్‌ రౌండ్‌లో..

19 Feb, 2020 16:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కాలేజీకి వెళ్లి చదువు కోవడం..  ఇంట్లో పని చేయడం తప్ప ఏమీ తెలియని నా జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి వచ్చింది. ఎప్పుడూ గొడవ పడే మేము ఫ్రెండ్స్‌గా మారడానికి ఎక్కువ  సమయం పట్టలేదు. నేను ఏ అమ్మాయి గురించి మాట్లాడినా గొడవ పడేది. అప్పుడే అర్థం అయింది.. తను నన్ను ప్రేమిస్తోందని. తన పుట్టినరోజుకు ముందు రోజు నాకు ప్రపోజ్‌ చేసింది. అప్పుడు నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ, హాలిడేస్‌కు తను ఇంటికి వెళుతుంటే నాకు ఏడుపొచ్చింది. ఆ రోజు అర్థమైంది! తనని నేను ప్రేమిస్తున్నానని.  ‘నేను ఎక్కడికీ వెళ్లను బుజ్జి! మళ్లీ వస్తాగా’ అని తను వెళ్లిపోతుంటే చాలా బాధ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను వచ్చి వెళ్లిన ప్రతీసారి బాధ పడుతూనే ఉన్నా. ఎందుకంటే ఎంత సేపు చూసినా తను నన్ను వదిలి వెళ్లే చివరి నిమిషం చాలా బాధిస్తోంది. 

అందరి లవ్ స్టోరీలో లాగే మా లవ్‌లో కూడా గొడవలు వచ్చాయి. కానీ, అపుడు మేము విడిపోలేదు. అడ్జస్ట్‌ అవుతూనే వచ్చాము. కానీ మా ప్రేమ పెళ్లి వరకు తీసుకు వెళ్లాలంటే మనీ, క్యాస్ట్ ప్రాబ్లమ్స్‌గా మారాయి. క్యాస్ట్ మార్చలేం కదా అందుకే మనీ అయినా ఉండాలనుకున్నాం.  మాది  ఒక పూర్ ఫ్యామిలీ! ఎంత పూర్ అంటే తనతో ఒక నైట్ ఫోన్ కాల్ మాట్లాడాలంటే వన్ డే హోటల్ సర్వర్‌గా పనిచేసే వాడిని. తనకి ఒక రింగ్ కొనాలని రెండు నెలలు బార్లో సర్వర్‌గా పని చేశా. తను రిచ్ గాళ్‌! ఎలా అయినా మా ఫ్యామిలీ, నేనూ డెవలప్ అవ్వాలనుకున్నాం. మా డాడీని ఒప్పించి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాం. ఎలాగో డెవలప్ అయ్యాం. ఇక నేను మంచి జాబ్ చేయాలనుకున్నపుడు! ‘సాఫ్ట్‌వేర్‌ జాబ్ ట్రై చెయ్’ అని చెప్పింది.

ఎందుకంటే కొద్ది టైంలో ఎక్కువ శాలరీ రావాలంటే సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్ కరెక్ట్ అనుకున్నాం. తనని సీఏ చేయమని చెప్పా. నాకా ఒక ముక్క ఇంగ్లీష్ రాదు! సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్ ఎలా? అనుకున్నా అప్పుడే వాళ్ల అక్కకి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాయి. తరువాత తనకి, సో! త్వరగా కోర్స్ చేసి మంచి జాబ్ తెచ్చుకోవాలి. ఆరు నెలల్లో చేయాల్సిన కోర్స్  ఒక నెలలో చేసి జాబ్ ట్రైల్స్‌కు ఫిబ్రవరి 14న వెళ్లా. నాకు తన దగ్గరకి వెళ్లాలని ఉండేది. తనకేమో నేను జాబ్ కోసం వెళ్లాలని ఉండేది.  జాబ్‌కోసం సెర్చ్ చేస్తున్న టైంలో తనకి ఎగ్జామ్స్. నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యా! ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్‌కు వెళ్లా. మా ఇద్దరి మధ్యా చిన్న గొడవ వల్ల సరిగా ఏకాగ్రత ఉంచలేక ఫైనల్ రౌండ్లో జాబ్ మిస్ అయింది. 

చదవకుండా టైం వేస్ట్ చేస్తోందని తనని తిట్టా. కానీ, మామూలే మళ్లీ చదవకుండా ఉండే సరికి కోపంలో బాగా తిట్టి, ‘నెల రోజులు వెయిట్ చెయ్‌ అమ్ము! గొడవ పడటానికి కరెక్ట్ టైం కాద’ని చెప్పా. వన్ మంత్ మాట్లాడలేదు. నాకు జాబ్ వచ్చేసింది! ఫుల్ హ్యాపీతో తనకి చెప్పా. అంతే ఏమైందో తెలీదు. ఆ వన్ మంత్ తను చాలా బాధ పడి నాపై ద్వేషం పెంచుకుంది. ‘నేను నీ సెకండ్ ఆప్షన్! నేను ఉంటే జాబ్ తెచ్చుకోలేవా’ అని వెళ్లి పోయింది. తనే తిరిగి వస్తుందిలే అనుకున్నా. కానీ  రాలేదు . తను వస్తుందని 4 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూనే ఉన్నా. ‘తప్పకుండా వస్తావ్ కదా అమ్ము .. నీకోసం ఎదురు చూస్తూనే వుంటా .
మిస్‌ యూ అమ్ము.. లవ్  యు బంగారం ...లవ్ యూ ఫరెవర్ బంగారం..
- బుజ్జి



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు