తన నవ్వులు మళ్లీ చూడాలని ఉంది

21 Nov, 2019 16:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఒంటరిగా జాబ్ చేసుకుంటూ ఉన్న నా జీవితంలోకి  ఒక నవ్వుల హరివిల్లులాగా ప్రవేశించింది. ప్రతి రోజూ నవ్వుతూ నవ్విస్తూ స్నేహం చేసింది. నాకు తెలీకుండానే నన్ను, నా గురించి పూర్తి వివరాలు సేకరించింది. ఈ లోపే తనంటే ఎక్కువ ఇష్టం పెరిగిపోయింది. తన మీద ప్రేమని నాతోనే చెప్పేలా చేసుకుంది. నాతో రెండు సంవత్సరాలు స్నేహం చేస్తూ ప్రేమించింది. నాతో చెప్పలేక తనకు నా మీద ఉన్న ఇష్టాన్ని ఇంకోలా చూపించింది. కొద్ది రోజులకు నేను తనకంటే రెండు సంవత్సరాలు చిన్న అని తెలిసింది. అయినప్పటికీ నేను ప్రేమించే తనకు నా ప్రేమని చెప్పాను. ‘మొదట మా నాన్నని అడిగి ఒప్పించు చేసుకుంటా’ అని అన్నది. అలా ఆరు నెలలు నన్ను నా ప్రేమని అర్ధం చేసుకుని నేను అంటే ఇష్టం అని నాతో అన్నింటిని చెప్పేసింది. నాకు చాలా దగ్గరయ్యింది. ఇంకో రెండు రోజుల్లో తన పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు ఇంటికి వచ్చి వాళ్ల నాన్నని అడగాలని చెప్పింది. ఇంటికి పిలిచింది! ఎదురుగా వాళ్ల నాన్న కూర్చున్నాడు. అప్పుడే నేను నా మనసులో ఉన్నది చెప్పేశా.

వాళ్ల నాన్న కోపంతో ‘ఇలా చెప్పడం తప్పు ఇక్కడి నుంచి వెళ్లు’ అని అన్నాడు. ఆ క్షణం తను ఒక్కసారి కూడా నోరు విప్పి ‘నాకు కూడా ఇష్టమే’ అని చెప్పలేకపోయింది. మరుసటిరోజు తను ఆఫీసుకు వచ్చింది. అసలు ఏమీ మాట్లాడలేదు. తను ‘నన్ను కలువకు, మాట్లాడకు’ అని చెప్పి వెళ్లిపోయింది. ఒక రోజు ఫోన్ చేసి ‘మా నాన్నకు ఇష్టం లేదు! అందుకే ఇప్పుడు నన్ను మర్చిపో.. నాకోసం ఈ ఒక్కటి చేస్తావా?’ అని అడిగింది. తన మీద ఉన్న ఇష్టంతో సరే అని చెప్పేశా. అలా అప్పటినుంచి ఆమె కోసమే ఇప్పటికీ ఎదురుచూస్తున్న. వస్తుందో.. రాదో.. తన నవ్వులు మళ్లీ చూడాలని ఉంది. నా మిగిలిన జీవితం ఆమె కోసమే అని ఆరాట పడుతోంది.
- చిన్నయ్య
చదవండి : ప్రతీ అమ్మాయి వెంట పడేవాడిని.. కానీ..
ఆమె కళ్లలో కొన్ని వేల సూటి ప్రశ్నలు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు